విజయమ్మ పసుపుమయం, షర్మిల కోసం (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షులు వైయస్ విజయమ్మ, నాయకురాలు షర్మిలలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. జగన్ తూర్పు గోదావరి జిల్లాలో, షర్మిల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, విజయమ్మ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి.. రాష్ట్ర చరిత్రనే మారుస్తానని జగన్ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన సభలో అన్నారు. తాను ముఖ్యమంత్రిని అయితే ఐదు సంతకాలతో పేద వర్గాల తలరాతలు మారుస్తానని చెప్పారు.
రూ.700కు పింఛను పెంపు, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు రూ. వేల కోట్లతో నిధి ఏర్పాటు, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రతీ కుటుంబానికి రేషన్‌కార్డు, ఇల్లు, పిల్లల చదువుకు ఒక్కొక్కరికీ నెలకు రూ.500 అందిస్తామని పేర్కొన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
సమైక్యవాది అని చెప్పుకొంటున్న మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రకటన రోజే ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.

వైయస్సార్ కాంగ్రెస్
రాష్ట్ర విభజనకు బిజెపి కూడా గుడ్డిగా మద్దతు తెలిపిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అమ్ముకుని ప్రజలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు.

వైయస్సార్ కాంగ్రెస్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షులు వైయస్ విజయమ్మ, నాయకురాలు షర్మిలలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. జగన్ తూర్పు గోదావరి జిల్లాలో, షర్మిల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, విజయమ్మ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
తాము అధికారంలోకి వస్తే ఇంగ్లీషు మీడియం పాఠశాలలను ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు. చంద్రబాబు భయానక పాలన అందించాడని ఆయనకు నిజాయితీకి, విశ్వసనీయతకు అర్థం తెలియదని విమర్శించారు.

వైయస్సార్ కాంగ్రెస్
తిరిగి మళ్లీ అధికారంలోకి రావాలని ఇంటికో ఉద్యోగం, రైతుల రుణాలు మాఫీ వంటి దొంగ హామీలు ఇస్తున్నాడని, వాటిని నమ్మి మరొకసారి మోసపోవద్దని అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
30 మంది ఎంపీలను గెలిపించుకొంటే మన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నాయకుడినే ప్రధానమంత్రిని చేసి మన తల రాతను మార్చుకోవచ్చునన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందామని షర్మిల పేర్కొన్నారు. మహిళలకు చంద్రబాబు రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తే వైఎస్ పావలా వడ్డీకే ఇచ్చారన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
కిరణ్ హయాంలో అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయి పేదల జీవనం దుర్భరంగా మారిందన్నారు. అత్యధిక ఎంపీ సీట్లిచ్చిన తెలుగు ప్రజల గొంతును సోనియా కోసేశారని అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
అనంతపురం జిల్లా తాడిపత్రి రోడ్ షోలో గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ బాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

వైయస్సార్ కాంగ్రెస్
వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నంతవరకు తెలంగాణ సమస్య రాలేదని, ఆయన మరణానంతరం మూడేళ్లలోనే తెలంగాణ ఇచ్చేశారన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications