మంగళగిరిలో దారుణం.. 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ !!
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో తండ్రీకొడుకులు ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట టాపిక్ గా మారింది.
నార్త్ సబ్‌డివిజన్ డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 18వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో బాధిత బాలిక తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో, అక్కడే మాటు వేసిన ముగ్గురు నిందితులు ఆమెను మాయమాటలతో నమ్మించి ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. ఆమెను ఆటోలో తీసుకెళ్లిన నిందితులు బాలికను మంగళగిరి బైపాస్ వెంబడి ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో పాల్గొన్నవారిలో షేక్ ఖాదర్ బాషా (50) - తాడేపల్లి కేఎల్ రావు కాలనీ, షేక్ సలీమ్ (42) - విజయవాడ ప్రకాష్ నగర్, షేక్ రబ్బానీ (39) ఉన్నారు. అనంతరం సలీమ్ బాలికను లక్ష్మీ నరసింహస్వామి కాలనీ చివరకు తీసుకువెళ్లి మరోసారి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఖాదర్ బాషా, అతని కుమారుడు కమల్ సాహెబ్ (25) బాలికను తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి తీసుకువెళ్లి మళ్లీ అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో తండ్రీకొడుకుల ప్రమేయం ఉండటం తీవ్ర కలకలం రేపింది.
అయితే ఆ తర్వాత షేక్ రబ్బానీ బాలికను ఆటోలో తీసుకువెళుతుండగా.. ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు ఆటోను అడ్డుకుని బాలికను నిందితుల నుంచి విడిపించారు. దీంతో బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడింది. చివరికి బాధితురాలు ఇంటికి చేరుకుని తల్లికి జరిగిన విషయం వివరించింది. వెంటనే ఆమె తల్లి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు నిందితులపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరు ఎయిమ్స్‌కు తరలించామని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు అవసరమైన వైద్య, మానసిక సహాయం అందిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. నిందితులను ఆదివారం సాయంత్రం కోర్టులో హాజరుపరచగా.. అంతకు ముందు నిందితులను స్టేషన్ నుంచి కోర్టు వరకు రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్థానికులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications