శృంగారానికి నిరాకరించడం నేరం కాదు
భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే అయినప్పటికీ.. ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం నేరం కాదని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం (Karnataka High Court) వ్యాఖ్యానించింది. తన వివాహం పరిపూర్ణం కాలేదంటూ భర్త, అత్తమామలపై ఓ మహిళ పెట్టిన క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టేసింది.

ఫిర్యాదు చేసిన స్త్రీకి డిసెంబరు 18, 2019లో వివాహమైంది. అయితే, ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ఆమె భర్త భార్యతో శారీరక బంధాన్ని (Physical Relationship) ఏర్పరుచుకునేందుకు నిరాకరించాడు. కేవలం 28 రోజులు మాత్రమే అత్తింట్లో ఉన్న ఆ స్త్రీ పుట్టింటికి వచ్చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, వరకట్న నిరోధక చట్టం కింద 2020 ఫిబ్రవరిలో భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. హిందూ వివాహ చట్టం ప్రకారం తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదని, తన పెళ్లిని రద్దు చేయాలని కోరింది. ఈమేరకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈమె పిటిషన్‌ను పరిశీలించిన కుటుంబ న్యాయస్థానం 2022 నవంబరులో వీరి పెళ్లిని రద్దు చేసింది. అత్తింటిపై పెట్టిన క్రిమినల్ కేసును మాత్రం ఆమె వెనక్కి తీసుకోలేదు.

తనపై, తన తల్లిదండ్రులపై నమోదైన ఛార్జ్‌షీట్‌ను సవాల్ చేస్తూ ఆ భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ఇటీవల కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తపై ఉన్న ఆరోపణ ఒక్కటేనని, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆయన శారీరక బంధం వద్దని విశ్వసించాడు.

ప్రేమ అంటే కేవలం మనసులకు సంబంధించింది మాత్రమేనని నమ్మాడు. హిందూ వివాహ చట్టం ప్రకారం భార్యతో శారీరక బంధాన్ని నిరాకరించడం క్రూరత్వమే అవుతుంది. అయినప్పటికీ ఐపీసీ 498ఏ ప్రకారం నేరం కిందకు రాదు. ఈ కేసులో భర్తపై క్రిమినల్ చర్యలు చేపడితే వేధింపుల చర్యకిందకే వస్తుంది. అతడు వేసిన పిటిషన్ ను అంగీకరించి సదరు భర్తపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టేస్తున్నట్లు తీర్పునిచ్చింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications