రైల్లోంచి తోసివేత: ఆస్పత్రిలో మహిళా టిసీ (ఫొటో)
హైదరాబాద్: నగరంలోని మదాపూర్ హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో టికెట్ కలెక్టర్ గీతను ఓ ప్రయాణికుడు ఎంఎంటిఎస్ రైలులో నుండి తోసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గీతకు తీవ్రగాయాలు అవడంతో వెంటనే మెట్టుగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు.
టికెట్ అడిగినందుకు దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో రైలు లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో రైలు బయలుదేరే సమయంలో కొందరు వ్యక్తులను టికెట్ అడగగా వారు ఆమెపై దాడి చేసి రైలు నుంచి కిందకు తోసేశారు.

టికెట్ లేకపోవడం వల్ల జరిమానా కట్టాలని గీత అడిగారు. దాంతో దుండగులు ఆ ఘోరానికి పాల్పడ్డారు. గీత సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో నివాసం ఉంటున్నారు. డబ్బులు ఇవ్వాల్సి వస్తుందన్న కోపంతో ఆమెను ప్రయాణికుడు రైల్లోంచి తోసేశాడు. తలుపుల వద్దే ఉండడంతో ఆమె ప్లాట్‌ఫారంపై పడిపోయారు.
ఆమెకు గదవ కింద, మోకాలు వద్ద గాయాలు అయ్యాయి. ప్రయాణికుల ధోరణి మారుతుండడంతో బోగీకి ఓ టీసిని నియమించాలని టీసిల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ అధికారులను కోరారు. మహిళ అని కూడా చూడకుండా ప్రయాణికుడు ఆమెను తోసేయడం దారుణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications