వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వంపై రెచ్చిపోయిన జగన్, హావభావాలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాసనసభలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు, ప్రభుత్వం, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రెచ్చిపోయారు. అవసరమైతే స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని చెప్పారు.

శాసనసభ ఆవరణలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. శాసనసభలో అధికార పక్షం తీరు అత్మస్తుతి, పరనిందగా ఉందని ఆయన అన్నారు. శాసనసభ స్పీకర్ తీరును ఆయన తప్పు పట్టారు. తన మైకును ఎన్నిసార్లు కట్ చేసిందీ చెప్పారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా జరిగి ఉండదని ఆయన మండిపడ్డారు.

శాసనసభ టీవీ ప్రసారాలు కూడా అధికార పక్షం సభ్యులు మాట్లాడుతున్నవాటినే చూపిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి శాసనసభను నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంగా తమ పార్టీ ఒక్కటి మాత్రమే ఉందని, ప్రతిపక్షం గొంతు వినాలని ప్రజలు అనుకుంటారని, కానీ తమకు గంటన్నర సమయం మాత్రమే కేటాయించారని ఆయన అన్నారు. సమయం ఇవ్వాలంటే ప్రతిపక్షం మాట్లాడకూడదనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

నాకు మైక్ ఇవ్వలేదు...

నాకు మైక్ ఇవ్వలేదు...

ప్రతిపక్ష నేతగా తాను వాకౌట్ చేయబోతున్నానని చెప్పినా కూడా తనకు మైకు ఇవ్వలేదని వైయస్ జగన్ ఆరోపించారు.

ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు..

ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు..

మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వని పరిస్థితి ఎప్పుడూ లేదని, ఇంతకు ముందు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయో తాను చూశానని జగన్ అన్నారు.

ఇంత దారుణమా...

ఇంత దారుణమా...

శాసనసభా సమావేశాలు ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదని జగన్ అన్నారు. చాలా దారుణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలా మైక్ కట్..

ఇలా మైక్ కట్..

తాను చంద్రబాబు హామీలపై, బడ్జెట్ కేటాయింపులపై మాత్రమే మాట్లాడానని, ఇతర అంశాలు ఏవీ మాట్లాడలేదని, అయినా 17 సార్లు మైక్ కట్ చేశారని జగన్ అన్నారు.

రెండు నిమిషాలు...

రెండు నిమిషాలు...

రెండు నిమిషాలు మాట్లాడితే మైక్ కట్, నాలుగు నిమిషాలు మాట్లాడితే మైక్ కట్.. అన్యాయంగా మైక్ కట్ చేశారని జగన్ అన్నారు.

ఇంత అంతరాయం...

ఇంత అంతరాయం...

తన ప్రసంగానికి అధఇకార పక్షం గంటా 6 నిమిషాల పాటు అంతరాయం కలిగించి 21 నిమిషాలు మాత్రమేనని ప్రభుత్వం చెబుతోందని జగన్ అన్నారు.

ఎబిఎన్ ఆంధ్రజ్యోతికిచ్చారు..

ఎబిఎన్ ఆంధ్రజ్యోతికిచ్చారు..

అసెంబ్లీ టీవీ హక్కులు ఎబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చారని, అసెంబ్లీ టీవీ కూడా అధికార పార్టీ సభ్యుల వైపు వెళ్లిపోతుందని, తాము ఎందుకు నిరసన తెలుపతున్నామో టీవీలో కనిపించదని, తమ మాట కూడా వినిపించది జగన్ అన్నారు.

ఏ ప్రశ్న వేసినా...

ఏ ప్రశ్న వేసినా...

తాము ఏ ప్రశ్న వేసినా ప్రభుత్వంవారు ఇచ్చే సమాధానంలో వైయస్ రాజశేఖర రెడ్డిని తిడుతారని, వివరణ కోసం మైక్ అడిగితే ఇవ్వరని జగన్ అన్నారు..

అప్పుడే చూపిస్తారు..

అప్పుడే చూపిస్తారు..

వైయస్ రాజశేఖర రెడ్డిని తిట్టేటప్పుడు మాత్రమే టీవీలో చూపిస్తారని, తాము నిరసన తెలిపేది టీవీలో చూపించరని జగన్ అన్నారు.

సస్పెండ్ చేశారు...

సస్పెండ్ చేశారు...

తమ శాసనసభ్యులను సస్పెండ్ చేశారని, వారికి మాట్లాడేందుకు అవకాశం ఇద్దామని అనుకోరని, తాము 678 మంది శాసనసభ్యులం ఉన్నామని, తమకు 40 శాతం సమయం కేటాయించాలని జగన్ అన్నారు.

స్పీకర్‌పై అవిశ్వాసం..

స్పీకర్‌పై అవిశ్వాసం..

శానససభ తీరు ఇదే విధంగా కొనసాగిుతే తాము స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని జగన్ చెప్పారు. శాసనసభ్యుల సస్పెన్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Opposition leader and YSR Congress party president YS Jagan has slammed ruling Telugudesam party attitude in Andhra Pradesh assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X