హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బషీర్‌బాగ్ కాల్పులు: 14 ఏళ్ల క్రితం ఇదే రోజు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2000 ఆగస్టు 28వ తేదీన హైదరాబాదులోని బషీర్ బాగ్ చౌరస్తా అట్టుడికింది. పోలీసు కాల్పులతో దద్ధరిల్లింది. అప్పుడు చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికరాంలో ఉంది.

విద్చుచ్చక్తి రేట్లను విపరీతంగా పెంచడానికి వ్యతిరేకంగా పోరాటం సాగింది. తొమ్మిది వామపక్షాల ఆధ్వర్వంలో దశలవారీగా ఉద్యమం వూపందుకుంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెసు పార్టీ ఆ ఉద్యమానికి మద్దతు తెలిపి, అందులో పాల్గొంది.

విద్యుత్తు చార్జీల పెంపునకు నిరసనగా ఆగస్టు 28 చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. దాంతో బషీర్ బాగ్ వద్ద ముళ్ల కంచెలు వేసి భారీగా పోలీసులను మోహరించారు. ముందుకు రాకుండా దిగ్బంధం చేయాలనే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాలస్వామి, విష్ణువర్ధన్‌, రామకృష్ణ మరణించారు.

విద్యుత్తు చార్జీల పెంపును నిరసిస్తూనే అప్పటి డిప్యూటీ స్పీకర్‌ పదవికి కె.చంద్ర శేఖర రావు రాజీనామా చేసి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఏర్పాటు చేశారు.

బషీర్ బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులు

విద్యుత్తు చార్జీల పెంపునకు నిరసనగా చేపట్టిన ఆందోళన సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో 14 ఏళ్ల క్రితం ఓ ఆందోళనకారుడు ఇలా మరణించాడు.

బషీర్ బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులు

14 ఏళ్ల క్రితం అప్పటి చంద్రబాబు నాయుడి పాలనలో విద్యుత్తు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. బషీర్ బాగ్ వద్ద పోలీసులు ఆందోళనకారులపైకి కాల్పులు జరిపారు.

బషీర్ బాగ్ కాల్పులు...

బషీర్ బాగ్ కాల్పులు...

విద్యుత్తు ఉద్యమం సందర్భంగా 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ బషీర్ బాగ్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులపైకి కాల్పులు జరిపారు.

బషీర్ బాగా కాల్పులు..

బషీర్ బాగా కాల్పులు..

విద్యుత్తు ఉద్యమం సందర్భంగా 14 ఏళ్ల క్రితం ఆగస్టు 28వ తేదీన బషీర్ బాగ్ వద్ద ఆందోళకారులపైకి పోలీసులు ఇలా తుపాకులు ఎక్కుపెట్టారు

బషీర్ బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులు

14 ఏళ్ల క్రితం హైదరాబాదులోని బషీర్ బాగ్ వద్ద విద్యుత్తు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో ఇలా లాఠీలు ఝళిపించారు.

బషీర్ బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులు

విద్యుత్తు చార్జీల పెంపునకు నిరసనగా అప్పుడు తొమ్మిది వామపక్షాలు పెద్ద యెత్తున ఉద్యమాన్ని లేవదీశాయి. 2000 ఆగస్టు 24వ తేదీన బషీర్ బాగ్ వద్ద ఇలా.

బషీర్ బాగ్ కాల్పులు...

బషీర్ బాగ్ కాల్పులు...

చలో ఆసెంబ్లీ చేపట్టిన ఆందోళనకారులు 14 ఏళ్ల క్రితం ఆగస్టు 28వ తేదీన హైదరాబాదులోని బషీర్ బాగ్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

బషీర్ బాగ్ కాల్పులు..

బషీర్ బాగ్ కాల్పులు..

ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఇనుప కంచెలు, వాటర్ క్యానన్లు ఇలా..

బషీర్ బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులు

సరిగ్గా 14 ఏళ్ల క్రితం విద్యుత్తు ఉద్యమంలో అట్టుడికిన రాష్ట్రం బషీర్ బాగ్ వద్ద తారాస్థాయికి చేరుకుంది. బషీర్ బాగ్ వద్ద దృశ్యం ఇది..

బషీర్ బాగ్ కాల్పులు..

బషీర్ బాగ్ కాల్పులు..

ఆందోళనకారులు 14 ఏళ్ల క్రితం బషీర్ బాగ్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను, ఇనుప కంచెలను దాటుకుని అసెంబ్లీ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు.

బషీర్ బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులు

ఆందోళనకారులను అదుపు చేసి, చెదరగొట్టడానికి పోలీసులు బషీర్ బాగ్ వద్ద 14 ఏళ్ల క్రితం ఇలా కాల్పులు జరిపారు.

బషీర్ బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులు

హైదరాబాదులోని బషీర్ బాగ్ వద్ద ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

బషీర్ బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులు

ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో బషీర్ బాగ్ వద్ద ఇద్దరు ఆందోళనకారులు కుప్ప కూలారు. ఒకతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

బషీర్ బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ పోలీసు కాల్పుల్లో రామకృష్ణ అనే ఆందోళనకారులు ఇలా కుప్పకూలిపోయాడు. అతన్ని ఇతరులు రక్షించడానికి ప్రయత్నించారు.

English summary
On same day on august 28 in 2000 left parties and Congress organised chalo assembly against Chandrababu Naidu government opposing hike in power charges. Three activists killed in police firing at Bashir bagh in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X