అతనికి కళ్లు చెదిరే అక్రమాస్తులు: ఆ చిట్టా ఇదే (పిక్చర్స్)

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు రవాణా శాఖలోని అవినీతి తిమింగలం గుట్టు రట్టు చేశారు. ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన కోట్లాది రూపాయల విలువ చేసే అక్రమార్జన ఏసీబీ అధికారుల బయటపడింది. విశాఖ రవాణా శాఖ పరిధిలో సీనియర్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సంపతరావు రమేష్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం దాడి చేశారు.

ఆయన బంధువులు, మిత్రుల ఇళ్లలోనూ 11 బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయా దాడుల్లో లెక్కలు చూపని రూ.25 కోట్ల విలువైన ఆస్తులు సహా లక్షల కొద్దీ కరెన్సీ కట్టలు, కిలోకు పైగా బంగారు ఆభరణాలు బయటపడ్డాయి.

సాధారణ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ వద్ద ఈ స్థాయిలో ఆస్తులు బయటపడడం తీవ్ర అశ్చర్యానికి గురి చేసింది. వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ ఇంట్లో రూ.పది లక్షల నగదు, రూ.11 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌, 1100 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి వస్తువులు, 4 లక్షల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాలు లభించాయి.

అవినీతి తిమింగలం

అవినీతి తిమింగలం

సంపత్ రావు రమేష్‌కు ఎన్‌ఏడీ కూడలి, మధురవాడల్లో 2 షాపింగ్‌ కాంప్లెక్సులు, మధురవాడలో 5 ఫ్లాట్లు, నగరంలోని ద్వారకానగర్‌లో 4 అంతస్తుల్లో 28 గదులున్న దినేష్‌ లాడ్జి, ఎంవీపీ కాలనీలో ఒక ఫ్లాటు ఉన్నట్లు ఎసిబి సోదాల్లో బయటపడింది.

అవినీతి తిమింగలం

అవినీతి తిమింగలం

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మూడంతస్తుల భవనం, ఒక వెర్నా కారు, ఒక జీపు, ఒక స్కార్పియో, ఒక ద్విచక్ర వాహనాన్ని ఎసిబి అధికారులు గుర్తించారు. కొన్ని లాకర్లను బుధవారం తెరవాల్సి ఉంది.

అవినీతి తిమింగలం

అవినీతి తిమింగలం

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన రమేష్‌ 1984లో రవాణా శాఖలో చేరి, 1998-2002 మధ్య విశాఖలో ఎంవీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో ఆయన ప్రతి దానికీ వసూళ్లు చేసేవాడని ఆ శాఖ వర్గాలే తెలిపాయి.

అవినీతి తిమింగలం

అవినీతి తిమింగలం

రమేష్ 30 ఏళ్ల సర్వీసులో సుమారు పాతిక కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టాడు. సిఐయు డిఎస్పీ రమాదేవి అందించిన వివరాల ప్రకారం రమేష్ ఇంటితోపాటు, అతని బంధువులు, స్నేహితుల ఇళ్లు, కార్యాలయాలపై మంగళవారం దాడులు జరిపారు.

అవినీతి తిమింగలం

అవినీతి తిమింగలం

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 12 చోట్ల ఈ దాడులు నిర్వహించారు. రమేష్‌కు విశాఖ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన ద్వారకానగర్‌లో 28 గదులతో కూడిన నాలుగు అంతస్థుల లాడ్జి ఉందని డిఎస్పీ రమాదేవి తెలియచేశారు.

అవినీతి తిమింగలం

అవినీతి తిమింగలం

రమేష్ ఆస్తులన్నీ రమేష్ భార్య, కుమారుడి పేరు మీద ఉన్నాయని రమాదేవి వెల్లడించారు. ఆస్తుల డాక్యుమెంట్ విలువ మూడు కోట్ల రూపాయలని, మార్కెట్ విలువ సుమారు 25 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ఆమె తెలియచేశారు.

అవినీతి తిమింగలం

అవినీతి తిమింగలం

రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, బుధవారం రిమాండ్‌కు పంపిస్తామని ఆమె వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+