వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బారికేడ్లు: వేరు చేశారు, ఇలా దాటారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. ఇరు రాష్ట్రాల సచివాలయాల మధ్య బారికేడ్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యను ఎదుర్కునేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే బారికే డ్ల ఏర్పాట్లపై ఏపీ, తెలంగాణ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. బారికేడ్లు వేసే ముందు తమతో సంప్రదించాల్సిందని ఏపీ సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు మురళీ కృష్ణ అన్నారు. బారికేడ్ల కారణంగా ఇరు రాష్ట్ర ఉద్యోగుల్లో భేదాభిప్రాయాలు కలుగుతాయని, ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బిఎస్ఎఫ్ బలగాలను ఎలా మోహరిస్తారని, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని వివిధ సంఘాల నాయకులు అన్నారు.

సచివాలయంలో బారికేడ్లు

సచివాలయంలో బారికేడ్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మధ్య అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి, సిఆర్‌పిఎఫ్ బలగాలను మోహరించారు.

సచివాలయంలో బారికేడ్లు

సచివాలయంలో బారికేడ్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాలను వేరు చేస్తూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి.

సచివాలయంలో బారికేడ్లు

సచివాలయంలో బారికేడ్లు

గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బారికేట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

సచివాలయంలో బారికేడ్లు

సచివాలయంలో బారికేడ్లు

ముందు తెలియకపోవడంతో ఉద్యోగులు శనివారం నాడు బారికేడ్లు చూసి ఆశ్చర్యపోయారు.

సచివాలయంలో బారికేడ్లు

సచివాలయంలో బారికేడ్లు

బారికేడ్ల ఏర్పాటుతో ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. ఇలా బారికేడ్లు దాటుతూ ఉద్యోగులు కనిపించారు.

సచివాలయంలో బారికేడ్లు

సచివాలయంలో బారికేడ్లు

రెండు రాష్ట్రాల సచివాలయాల మధ్య ఇలా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు, సిఆర్పిఎఫ్ సిబ్బంది కాపలా కాస్తున్నారు.

సచివాలయంలో బారికేడ్లు

సచివాలయంలో బారికేడ్లు

రెండు రాష్ట్రాల సచివాలయాలను వేరు చేస్తూ ఏర్పాటు చేసిన బారికేడ్లను చూసి ఉద్యోగులు విస్తుపోయారు.

సచివాలయంలో బారికేడ్లు

సచివాలయంలో బారికేడ్లు

రెండు రాష్ట్రాల సచివాలయాలను వేరు చేసి, నిత్యం నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

English summary
baricades were seen between Telangana and Andhra Pradesh secretariates. It was objected by staff
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X