జయసుధ మల్లెదండ, సంగీత బోర్ కొట్టారు (పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్నికల ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది. ప్రజలను ఆకట్టుకోవడానికి, వారికి దగ్గరగా వెళ్లడానికి వివిధ పార్టీ అభ్యర్థులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వారితో కలిసిపోయినట్లు వ్యవహరిస్తున్నారు. హైదరాబాదు నగరంలోని అభ్యర్థులు వినూత్నమైన పద్ధతిలో ప్రచారం సాగిస్తున్నారు.
కాంగ్రెసు సికింద్రాబాద్ శాసనసభా నియోజకవర్గం అభ్యర్థి జయసుధ మహిళలను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. మరోసారి విజయానికి ఆమె చెమటోడుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సనత్ నగర్ అభ్యర్థి టి. పద్మారావు విజయం కోసం చెమటోడుస్తున్నారు. ఆయన ప్రజలను కలుసుకుంటూ వారితో మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతా రెడ్డి ప్రచారం గురించి చెప్పనలవి కాదు. ఆమె అవిశ్రాంతంగా నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను అకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

జయసుధ ఇలా..
కాంగ్రెసు సికింద్రాబాద్ శాసనసభా నియోజకవర్గం అభ్యర్థి, సినీనటి జయసుధ ఓటర్లను ఇలా కలుస్తూ తనను తిరిగి గెలిపించాలని కోరుతున్నారు.

మల్లెదండ అల్లారు...
జయసుధ ఓ మహిళ ముందు ఉన్న మల్లెలను తీసుకుని, సగం అల్లిన దండను తాను అల్లడానికి ప్రయత్నిస్తూ ఇలా..

పరీమళాన్ని ఆస్వాదిస్తూ..
మల్లెపూదండను అల్లడం పూర్తి చేసి దాని సుగంధాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా జయసుధ ఇలా కనిపించారు. మల్లెలంటే మగువలకు ఇష్టమే కదా..

మహిళా సైన్యం..
సికింద్రాబాద్ కాంగ్రెసు అభ్యర్థి జసుధకు మహిళలే ప్రచార సైన్యంగా మారినట్లున్నారు. వారితో జయసుధ వీధులు తిరుగుతూ ఇలా...

టి. పద్మారావు ఇలా..
ఎండాకాలంలో సామాన్యుడి కూల్ డ్రింక్ కొబ్బరి నీళ్లే.. కొబ్బరి బొండాలు అమ్ముతున్న దుకాణం వద్ద తెరాస అభ్యర్థి టి. పద్మారావు ఇలా...

మహేష్ జైన్ ఇలా...
సికింద్రాబాదులోని సనత్‌నగర్ నియోజకవర్గంలో ఓ పార్టీ అభ్యర్థి మహేష్ జైన్ ఆలా ప్రచారం చేస్తూ కనిపించారు.

సిపిఎం అభ్యర్థి ఇలా..
హైదరాబాదులోని ముషీరాబాద్ శాసనసభా నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి శ్రీనివాస రెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రచారం సాగిస్తున్నారు.

అంజన్ కుమార్ యాదవ్ దానంతో కలిసి...
సికింద్రాబాద్ కాంగ్రెసు లోకసభ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ హైదరాబాదులోని ఆబిడ్స్‌లో ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గం అభ్యర్థి దానం నాగేందర్‌తో కలిసి ఇలా...

సంగీతారెడ్డి ఇలా..
తెరాస చేవెళ్ల లోకసభ అభ్యర్థి కొండా విశ్వేశ్వ రెడ్డి సతీమణి సంగీతా రెడ్డి మియాపూర్‌లో తన భర్త కోసం ప్రచారం చేస్తూ ఇలా కనిపించారు.

బోర్ కొట్టారు...
తన భర్త కొండా విశ్వేశ్వర రెడ్డి కోసం చేవెళ్ల నియోజకవర్గం మియాపూర్‌లో సంగీతా రెడ్డి ఇలా బోర్ కొట్టి మహిళనలు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ముఖేష్ గౌడ్ ఇలా..
హైదరాబాదు పాతబస్తీలోని గోషామహల్ శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ప్రచారం సాగిస్తూ ఇలా కనిపించారు.












Click it and Unblock the Notifications