'అనంత'లో కలామ్‌తో కలిసి చంద్రబాబు (పిక్చర్స్)

అనంతపురం: కరవులో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉందని, దాన్ని కరవు రహిత జిల్లాగా మారుస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అనంతపురం జిల్లా గరుడాపురంలో వ్యవసాయ మిషన్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన సోమవారం ప్రసంగిచారు. పూర్తి రుణాలు చెల్లించే బాధ్యత తనదేనని అన్నారు.

ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నామని, ఆదాయం కూడా లేదని చంద్రబాబు అన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలను తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్ని కష్టాలొచ్చినా టిడిపికి అండగా నిలిచేది అనంతపురం జిల్లానే అని ఆయన అన్నారు. తన జీవితంలో అనంతపురం జిల్లాను మరిచిపోనని ఆయన అన్నారు.

రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లాను క్రమపద్ధతిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులను రుణ విముక్తులను చేసి ఆదుకోవాలని అనుకున్నానని, పూర్తి చేస్తున్నానని ఆయన అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ముందుకు రాకున్నా, బ్యాంకులు ఇబ్బంది పెట్టినా, రైతులకు రుణ విముక్తి కల్పించడమే లక్ష్యమని చెప్పారు.

ఎన్టీఆర్ ప్రారంభించారు..

ఎన్టీఆర్ ప్రారంభించారు..

హంద్రీనీవా ప్రాజెక్టును మన నాయకుడు ఎన్టీఆర్ ప్రారంభించారని, దాన్ని పూర్తి చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు అన్నారు.

రుణమాఫీ నిధులు

రుణమాఫీ నిధులు

ఈ నెల 25వ తేదీ నాటికి 20 శాతం రుణమాఫీ నిధులు బ్యాంకులకు చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబాబు చెప్పారు.

మళ్లీ రుణాలు

మళ్లీ రుణాలు

డ్వాక్రా మహిళలకు మళ్లీ రుణాలు ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్తామని, ఆడబిడ్డలకు ఆర్థికంగా ఆసరాగా నిలుస్తామని చంద్రబాబు చెప్పారు.

బిందు సేద్యానికి..

బిందు సేద్యానికి..

అనంతపురం జిల్లాలో తుంపర, బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. భూగర్భ జలాలను పెంచి పంటలను సాగు చేసుకుందామని ఆయన చెప్పారు.

ప్రజలు శ్రమజీవులు

ప్రజలు శ్రమజీవులు

అనంతపురం జిల్లా ప్రజలు శ్రమజీవులని, శ్రమశక్తే ఈ జిల్లాకు బలమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు.

సిఎంకు సూచించా..

సిఎంకు సూచించా..

అనంతపురం, శ్రీకాకుళం మధ్య నీటి కాలువ ఏర్పాటు చేస్తే ఏడాది పొడవునా నీటి ఇబ్బంది ఉండదని తాను సిఎంకు సూచించినట్లు అబ్దుల్ కలాం చెప్పారు.

సంతోషకరం

సంతోషకరం

కళ్యాణదుర్గంలో ప్రాథమిక రంగ మిషన్ ప్రారంభించడం సంతోషకరమని అబ్దుల్ కలాం అన్నారు. రైతు సమస్యలు తీర్చగలిగితే సత్వర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

శాస్త్ర సాంకేతికతతో..

శాస్త్ర సాంకేతికతతో..

శాస్త్ర సాంకేతికతతో రైతులను రైతులను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అబ్దుల్ కలాం అన్నారు.

రాయితీల కోసం కాదు..

రాయితీల కోసం కాదు..

రైతులు రాయితీల కోసం చూడడం లేదని, నాణ్యమైన విత్తనాలు, విద్యుత్తు అందించాలని కోరుతున్నారని అబ్దుల్ కలాం అన్నారు.

రెండో హరిత విప్లవం

రెండో హరిత విప్లవం

దేశంలో రెండో హరిత విప్లవం అవసరమని అబ్దుల్ కలాం అన్నారు. చంద్రబాబుతో కలిసి అబ్దుల్ కలాం కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాబు, కలామ్ ఇలా..

బాబు, కలామ్ ఇలా..

అబ్దుల్ కలామ్‌తో కలిసి నారా చంద్రబాబు నాయుడు ఇలా రైతుల పంటలను పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+