అధైర్యపడలేదు: బాబు పట్టువస్త్రాలు (పిక్చర్స్)

విజయనగరం: రైతు రుణమాఫీకి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ అంగీకరించకపోయినా అధైర్యపడకుండా ఇచ్చిన మాట కట్టుబడి రైతు రుణాలు మాఫీ చేశామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విభజనతో రాష్ర్టానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు.

ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దనే 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామన్న ఆయన సంపద పెంపులో ఉద్యోగులు మరింత కృషి చేయాలని తెలిపారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

పార్వతీపురంలో హార్టికల్చర్‌ కాలేజి, చీపురుపల్లిలో వెటర్నరీ కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లాలో పోర్టు, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఏడాదిలోగా తోటపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. చెరువుల్లో పూడికతీస్తామని, మట్టిని పొలాల్లోకి తరలించుకోండని ప్రజలకు తెలియజేశారు.

అమ్మవారికి పట్టువస్త్రాలు

అమ్మవారికి పట్టువస్త్రాలు

చీపురుపల్లిలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారంనాడు పట్టువస్త్రాలు సమర్పించారు.

పట్టుకండువాతో సత్కారం

పట్టుకండువాతో సత్కారం

విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పట్టు కండువాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సత్కరించారు.

చంద్రబాబుకు ఆశీర్వాదాలు

చంద్రబాబుకు ఆశీర్వాదాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆశీర్వాదాలు అందజేశారు.

అమ్మవారికి పూజలు

అమ్మవారికి పూజలు

విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి నారా చంద్రబాబు నాయుడు పూజలు చేశారు.

హెలిపాడ్ వద్ద ఇలా...

హెలిపాడ్ వద్ద ఇలా...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో హెలిపాడ్ వద్ద ఇలా కనిపించారు.

ఆస్పత్రి భవనానికి పునాది రాయి

ఆస్పత్రి భవనానికి పునాది రాయి

విజయనగరం జిల్లా పార్వతీపురం వంద పడకల ఆస్పత్రి భవనానికి నారా చంద్రబాబు నాయుడు పునాది రాయి వేశారు.

స్వేచ్ఛ కార్యక్రమం

స్వేచ్ఛ కార్యక్రమం

స్వేచ్ఛ కార్యక్రమానికి చిహ్నంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారంనాడు స్వేచ్ఛ కార్యక్రమంలో జ్యోతి వెలిగించారు.

అవినీతిని ఉపేక్షించం

అవినీతిని ఉపేక్షించం

ప్రభుత్వ పథకాల్లో అవినీతిని ఉపేక్షించేలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన విజయనగరం జిల్లా పర్యటనలో స్పష్టం చేశారు.

ఆరోగ్యమే ముఖ్యం

ఆరోగ్యమే ముఖ్యం

ఎక్సైజ్‌ ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన విజయనగరం జిల్లా పర్యటనలో అన్నారు.

సొంత ఊళ్ల రుణం తీర్చుకోవాలి

సొంత ఊళ్ల రుణం తీర్చుకోవాలి

ధనవంతులు సొంత ఊర్ల రుణం తీర్చుకోవాలని, గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

విజయనగరం జిల్లా పర్యటనలో సిఎం

విజయనగరం జిల్లా పర్యటనలో సిఎం

విజయనగకుజిల్లా పర్యటనలో భాగంగా చీపురుపల్లిలో 30 పడకల ఆస్పత్రికి, పార్వతీపురంలో 100 పడకల ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే స్వచ్ఛ విజయనగరం పైలాన్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+