వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు దీక్ష భగ్నం: చూస్తూ లోకేష్, ఉద్రిక్తత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఐదు రోజుల క్రితం చేపట్టిన దీక్షను పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. ఎపి భవన్‌లో సోమవారం చంద్రబాబు తన దీక్షను ప్రారంభించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.

చంద్రబాబును ఆస్పత్రికి తరలించే సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి ముట్టడికి బయలుదేరారు. దీంతో పోలీసులు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను, ఎమ్మెల్సీలను అరెస్టు చేసి పార్లమెంటు పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కాగా, ఆస్పత్రిలో కూడా చంద్రబాబు దీక్ష చేస్తున్నారని చెబుతున్నారు. ఆయన ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. తనకు మరో రెండు మూడు రోజులు దీక్ష చేసే శక్తి ఉందని ఆయన చెబుతున్నారు.

చంద్రబాబు ఆగ్రహం..

చంద్రబాబు ఆగ్రహం..

రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ తాను చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేయడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబును తీసుకుని వెళ్తూ..

చంద్రబాబును తీసుకుని వెళ్తూ..

ఎపి భవన్‌లో దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పోలీసులు తీసుకుని వెళ్తూ ఇలా...

అడ్డుకునే ప్రయత్నం..

అడ్డుకునే ప్రయత్నం..

తమ నేతను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని ఇలా పక్కకు తొలగిస్తూ పోలీసులు.

నారా లోకేష్ ఇలా...

నారా లోకేష్ ఇలా...

తన తండ్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇలా చూస్తూ కనిపించారు నారా లోకేష్.

పోలీసులను అడ్డుకోవడానికి ఇలా...

పోలీసులను అడ్డుకోవడానికి ఇలా...

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చెంతకు పోలీసులు చేరుకోకుండా అడ్డుకోవడానికి పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు.

ఇలా వెంట పడ్డారు..

ఇలా వెంట పడ్డారు..

చంద్రబాబు నాయుడిని ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా ఆందోళనకు దిగారు.

ఇలా బ్యానర్లతో నినాదాలు..

ఇలా బ్యానర్లతో నినాదాలు..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలతో నినాదాలు రాసిన బ్యానర్లతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఫ్లెక్సీలపై ఆగ్రహం..

ఫ్లెక్సీలపై ఆగ్రహం..

శిక్షణా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై, బ్యానర్లపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు.

సోనియా ఫ్లెక్సీపై దాడి..

సోనియా ఫ్లెక్సీపై దాడి..

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫ్లెక్సీపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి, దాన్ని చించేశారు.

ఇలా అగ్రహం...

ఇలా అగ్రహం...

చంద్రబాబు నాయుడిని ఆస్పత్రికి తరలించడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు.

ఇంకా సత్తా ఉంది...

ఇంకా సత్తా ఉంది...

ఇంకా రెండు మూడు రోజులు దీక్ష చేసే శక్తి తనకు ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెసుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎపి భవన్ వద్ద ఉద్రిక్తత

ఎపి భవన్ వద్ద ఉద్రిక్తత

చంద్రబాబు నాయుడిని ఆస్పత్రికి తరలించే సమయంలో ఎపి భవన్ వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోనియా గాంధీ ఇంటి ముట్టడికి బయలుదేరారు.

రోడ్డుకు అడ్డంగా...

రోడ్డుకు అడ్డంగా...

పోలీసులు చంద్రబాబు నాయుడిని సమీపించకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. వారిని పోలీసులు తొలగించారు.

English summary
Telugudesam party president Nara Chandrababu Naidu, who was on fast opposing the creation of Telangana state, has been evacuated from AP bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X