వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిక్చర్స్: సచివాలయంలో ఇలా ఘర్షణ పడ్డారు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లు హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులకు మధ్య ఘర్షణ నెలకొంది.

పోలీసులు జోక్యం చేసుకుని ఘర్షణను నివారించారు. సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయం ఆవరణలో దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ఉద్యోగుల తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో సచివాలయం ఆవరణ హోరెత్తింది. కొంత ఆగ్రహానికి గురైన ఇరు ప్రాంత ఉద్యోగులు తోపులాటకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసు బలగాలు అతి కష్టం మీద వారిని వారించారు. ముఖ్యమంత్రి నివాసం సి బ్లాక్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు.

ఇరు ప్రాంతాల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా తాము శాంతియుతంగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నామని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేత ఒకరు తెలిపారు. తమకు పోటీగా ఆందోళనలు చేయడం వల్లే సమస్య మొదలైందని ఆయన అన్నారు. కాగా తెలంగాణ ఉద్యోగుల జెఏసి అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభజనకు అడ్డంకులు సృష్టిస్తే సహించబోమని హెచ్చరించారు.

సచివాలయంలో ర్యాలీ

సచివాలయంలో ర్యాలీ

తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరిన నేపథ్యంలో విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.

దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నం

దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నం

సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సచివాలయం ఆవరణలో సీమాంధ్ర ఉద్యోగులు దిష్టిబొమ్మను ఊరేగించి, దగ్ధం చేయడానికి ప్రయత్నించారు.

అడ్డుకున్న పోలీసులు

అడ్డుకున్న పోలీసులు

ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సి బ్లాక్‌ను ముట్టడించడానికి సీమాంధ్ర ఉద్యోగులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ ఉద్యోగుల ఆందోళన

తెలంగాణ ఉద్యోగుల ఆందోళన

సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనకు పోటీగా సచివాలయంలో శుక్రవారంనాడు తెలంగాణ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.

తెలంగాణ ర్యాలీలో శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ర్యాలీలో శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ఉద్యోగుల ర్యాలీలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ పాల్గొన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అడ్డుకున్న పోలీసులు..

అడ్డుకున్న పోలీసులు..

తెలంగాణ ఉద్యోగులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు ఘర్షణకు దిగిన నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుంది.

తెలంగాణ ఉద్యోగుల బైఠాయింపు..

తెలంగాణ ఉద్యోగుల బైఠాయింపు..

తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో బైఠాయించి తమ నిరసనను తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ పోలీసులతో మాట్లాడుతూ ఇలా..

తోపులాట ఇలా..

తోపులాట ఇలా..

పోటాపోటీ ఆందోళనల నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని తోపులాట జరిగింది.

English summary
Tension prevailed at Andhra Pradesh state secretariat on Friday as the employees of Seemandhra and Telangana nearly came to blows over the bill sent by the centre for formation of separate Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X