హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార పట్టిన గవర్నర్: చెత్త, గడ్డిగాదం ఎత్తివేత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజ్‌భవన్‌లో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ పాల్గొన్నారు. పార పట్టి గడ్డిని తొలగించారు. గవర్నర్‌తో పాటు కార్యాలయం ముఖ్య కార్యదర్శి నుంచి ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు రాజ్‌భవన్‌ ఆవరణను శుభ్రం చేశారు.

ఇక ప్రతి శనివారం సాయంత్రం 3.30 గంటల నుంచి 5.30 వరకు ఉద్యోగులంతా రాజ్‌భవన్‌లోని 30 ఎకరాలలో ఉన్న భవనాలు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని నిర్ణయించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా నిరుపయోగంగా ఉన్న పరిసరాలను పచ్చదనంతో నింపే కార్యక్రమాలను చేపట్టనున్నారు.

పరిసరాలను పచ్చిక బయళ్లు, హెర్బల్‌ గార్డెన్లు, గ్రీన్‌హౌస్‌లుగా మార్చి అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ రెండు లారీల గార్బేజ్‌ను ఎరువుగా సరఫరా చేయనుంది.

పార పట్టిన గవర్నర్

పార పట్టిన గవర్నర్

గవర్నర్ నరసింహన్ పార పట్టి గడ్డి తొలగించారు. రాజభవన్‌లో ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పార పట్టిన గవర్నర్

పార పట్టిన గవర్నర్

స్వచ్ఛ భారత్‌లో భాగంగా గవర్నర్ నరసింహన్ పార పట్టి గడ్డిని, చెత్తను ఎత్తేశారు. ప్రతి శనివారం ఈ కార్యక్రమం చేపడుతారు.

పారపట్టిన గవర్నర్

పారపట్టిన గవర్నర్

గవర్నర్ నరసింహన్ పార పట్టడంతో రాజభవన్ ఉద్యోగులంతా పరిసరాలను శుభ్రం చేసే పనిలోకి వచ్చేశారు.

పార పట్టిన గవర్నర్

పార పట్టిన గవర్నర్

గవర్నర్ నరసింహన్ పార పట్టి రాజభవన్ ఆవరణలోని గడ్డిగాదాన్ని తొలగించారు. పచ్చదనంతో పరిసరాలను నింపాలనేది ఆయన లక్ష్యం

పారపట్టిన గవర్నర్

పారపట్టిన గవర్నర్

గవర్నర్ నరసింహన్ రాజభవన్ పరిసరాలను పచ్చదనంతో కళకళలాడేలా చేయాలనే తలంపుతో గడ్డిగాదాన్ని తొలగించే పనిలో పడ్డారు.

పార పట్టిన గవర్నర్

పార పట్టిన గవర్నర్

ప్రతి శనివారం రాజభవన్ ఉద్యోగులతో ఈ విధమైన కార్యక్రమం తీసుకుని పచ్చదనంతో నింపే ప్రయత్నానికి గవర్నర్ పూనుకున్నారు.

English summary

 Governor of Telangana and Andhra Pradesh Narasimhan has taken up cleaing activity as a part of Swacch Bharath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X