కూత పెట్టిన హైదరాబాద్ మెట్రో రైలు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ ప్రజల మెట్రో రైలు కలలు నిజం కాబోతున్నాయి. మెట్రోరైలు ఇంజనీర్లు పట్టాలు, కోచ్‌ల పనితీరును పసిగట్టేందుకు గురువారం మెట్రోరైలును పట్టాలెక్కించారు.
మెట్రో రైలు కూత పెట్టి నగరవాసులకు ఆనందాన్ని ఇచ్చింది. మెట్రోరైలు ఉప్పల్, నాగోల్ డిపోల ఇంజనీర్లు ఇతర అధికారులకెలాంటి సమాచారం లేకుండా అనధికారికంగా అంతర్గతంగా కిలోమీటరు పొడువున మెట్రోరైలు టెస్ట్న్ నిర్వహించారు.
హైదరాబాద్ మెట్రోరైలు దేశంలోని ఇతర మెట్రో రైలు నిర్మాణ పనుల రికార్డులను అధిగమించిన విషయం తెలిసిందే. కేవలం 20 నెలల వ్యవధిలో రికార్డు స్థాయిలో 27 కిమీ పొడవున 1000 వయోడక్ట్‌లను ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి పది రోజుల క్రితం ప్రకటనలో తెలిపారు.

పట్టాలెక్కిన మెట్రో
హైదరాబాద్ మెట్రోరైలు పరుగులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే వచ్చే ఉగాది పర్వదినం నాటికి, పండుగ కానుకగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి.

పట్టాలెక్కిన మెట్రో
శిల్పారామం నుంచి నాగోల్ వరకు ఏర్పాటు చేయనున్న మెట్రోరైలు మూడో కారిడార్‌లో ఇప్పటికే కారిడార్, ట్రాక్, కోచ్‌లకు కరెంటు సరఫరా వ్యవస్థల పనులు తుది దశలో ఉన్నాయి.

పట్టాలెక్కిన మెట్రో
వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసి త్వరలోనే నాగోల్ డిపో నుంచి మెట్టుగూడ వరకు ఏడు కిలోమీటర్ల పొడువున ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారు.

పట్టాలెక్కిన మెట్రో
రెండు నుంచి మూడు నెలల పాటు కొనసాగనున్న ఈ ట్రయల్ రన్‌ను రైల్వే శాఖలోని రైళ్ల రాకపోకలు, భద్రత, సమన్వయం వంటి వివిధ విభాగాలకు చెందిన నిపుణులు పరిశీలిస్తారు.

పట్టాలెక్కిన మెట్రో
నిపుణులు, ఇంజనీర్ల పరిశీలన కోసమే ఈ చిన్నపాటి ట్రయల్ రన్ నిర్వహించామని, ఇదీ కూడా గత జూలై మాసంలోనే నిర్వహించాల్సిన ఉన్నందున, ఈ మధ్య కాలంలో పనులు కాస్త మందగించడంతో ఆగస్టు మొదటి వారంలో నిర్వహించారని మెట్రోరైలు అధికారులు కొందరు చెబుతున్నారు.

పట్టాలెక్కిన మెట్రో
ముందు ప్రకటించిన విధంగానే ట్రయల్ రన్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అపాయింట్‌మెంట్ తీసుకుని త్వరలోనే ట్రయల్ రన్‌ను ఎంతో ఆర్భాటంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పట్టాలెక్కిన మెట్రో రైలు
ఉన్నట్టుండి ఎలాంటి ఆర్భాటం లేకుండా నాగోల్ డిపో నుంచి జిఎస్‌ఐ వరకు నిర్మించిన మెట్రోకారిడార్‌పై రైలు నడవటాన్ని గమనించిన వాహనదారులు, పాదచారులు ఎంతో ఆసక్తితో తిలకించారు.

పట్టాలెక్కిన మెట్రో
ట్రాక్ వ్యవస్థ, కోచ్‌ల పనితీరు, రైలు నడుస్తున్నపుడు ఏమైనా లోపాలు, సమస్యలు తలెత్తితే సరిచేయవచ్చునని ఇంజనీర్లు శిల్పారామం నుంచి నాగోల్ వరకు ఏర్పాటు చేయనున్న కారిడార్-1లో నాగోల్ మెట్రో డిపో నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జిఎస్‌ఐ)వరకు గంటసేపు ఈ టెస్ట్ నిర్వహించారు.

పట్టాలెక్కిన మెట్రో రైలు
మెట్రోరైలు అధికారులు మాత్రం గత కొద్ది నెలలుగా ట్రయల్ రన్‌ను నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు సుమారు ఏడు స్టేషన్ల మీదుగా ఏడు కిలోమీటర్ల పొడువున ఎంతో ఆర్భాటంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇంజనీర్లు కిలోమీటరు పొడువున ట్రయల్ రన్ నిర్వహించారు.

పట్టాలెక్కిన మెట్రో...
ట్రాఫిక్ రద్దీతో అవస్థలు పడుతున్న మెట్రో రైలు ప్రారంభంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలకు పెద్ద ఊరట లభించనుంది.

పట్టాలెక్కిన మెట్రో
హంగామా లేకుండా హైదరాబాద్ మెట్రో రైలు కూత పెట్టడంతో జంటనగరాల ప్రజలు ఒకింత ఆశ్చర్యంతో, ఎంతో ఆనందంతో తిలకించారు.












Click it and Unblock the Notifications