కథల మాష్టారు కారా: ప్రత్యేక గుర్తింపు (పిక్చర్స్)

విశాఖపట్నం: ప్రముఖ కథా రచయిత, కథా నిలయం వ్యవస్థాపకులు కాళీపట్నం రామారావు మాస్టారు 90వ జన్మదిన వేడుకలను అసంఖ్యాక కథకులు, కవులు, అభిమానుల నడుమ ఆదివారం ఘనంగా నిర్వహించారు. అందుబాటులో ఉండే భాషలో రచనలు చేసిన గొప్ప రచయిత కాళీపట్నం రామారావు (కారా) అని ప్రముఖ సాహితీవేత్త, కవి శివారెడ్డి కొనియాడారు. ఆదివారం కారా 90వ జన్మదినోత్సవ సభలో శివారెడ్డి మాట్లాడారు.

సమాజంలో ఆయన అనుభవించిన బాధలకు యథాతథంగా అక్షర రూపం ఇవ్వడంతో ‘కారా' కథలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. వాక్యవిన్యాసం లేకుండా, లేనిపోని మాటలు సృష్టించకుండా నిత్య జీవితంలో జరుగుతున్న ఘటనలకు అక్షర రూపం ‘కారా' రచనలని ఆయన పేర్కొన్నారు.

విరసం రచయత చలసాని ప్రసాద్‌ మాట్లాడుతూ విశాఖ మహానగరంలో సాహిత్య రంగానికి రావిశాసి్త్ర, కారా మాస్టారులను సూర్యచంద్రులుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ‘కోర్టు మార్షల్‌' నాటకం పుస్తకాన్ని కారా మాస్టారు ఆవిష్కరించారు.

కారా జన్మదినోత్సవ సభ

కారా జన్మదినోత్సవ సభ

కథా రచయిత కాళీపట్నం రామారావు జన్మదినోత్సవ సభ విశాఖపట్నంలో ఆదివారంనాడు జరిగింది. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సాయంత్రం ‘కాళీపట్నం నవతీతరణం తెలుగు కథ వెలుగు' కార్యక్రమం నిర్వహించారు.

తెలుగు భాష ఉన్నంత కాలం

తెలుగు భాష ఉన్నంత కాలం

తెలుగు భాష ఉన్నంతకాలం సాహిత్య చరిత్రలో కాళీపట్నం రామారావు రచనలు సజీవంగా ఉంటాయని, సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలుస్తాయని మాజీ మేయర్‌ డీవీ సుబ్బారావు అన్నారు.

గణిత శాస్త్రంలో ఉపాధ్యాయుడైనా..

గణిత శాస్త్రంలో ఉపాధ్యాయుడైనా..

‘కారా' మాస్టారు గణిత శాస్త్రంలో ఉపాధ్యాయుడైనప్పటికీ సా హిత్య ప్రక్రియ ద్వా రా మహోన్నత శిఖరాలను అధిరోహించారని సుబ్బారావు అన్నారు. ప్రభుత్వం మాస్టారికి పద్మభూషణ్‌ బిరుదు ఇవ్వకపోవడం దురదృష్టమని ఆయన అన్నారు.

ఆనందంగా ఉంది..

ఆనందంగా ఉంది..

పూర్వవిద్యార్థులు తనను ఈ విధంగా గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందని కారా మాష్టారు అన్నారు.‘కారా' 90వ జన్మదినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.

కథలసంపుటి ఆవిష్కరణ

కథలసంపుటి ఆవిష్కరణ

సభలో మాస్టారి శిష్యులు రచించిన నవతీతరణోత్సవం, హింసపాదు,కలశపూడి కథలు వంటి పుస్తకాలను అతి థు లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘కారా' మాస్టారి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

యజ్ఞం నాటకం ప్రదర్శన

యజ్ఞం నాటకం ప్రదర్శన

వంగపండు రచించిన ‘యజ్ఞం'నాటకాన్ని సినీనటు డు, దర్శకుడు ఎస్‌.కె.మిశ్రో దర్శకత్వంలో ప్రదర్శించారు.‘కారా'మాస్టారి శిష్యు లు కుటుంబసమేతంగా హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

శివారెడ్డి ఇలా...

శివారెడ్డి ఇలా...

కాళీపట్నం రామారావు కథల ఔన్నత్యం గురించి ప్రముఖ కవి కె. శివారెడ్డి వివరించారు. అందుబాటులో ఉన్న భాషలో కారా కథలు రాశారని ఆయన అన్నారు.

సాహితీవేత్తల సమీక్ష

సాహితీవేత్తల సమీక్ష

‘‘కారా - నవతీతరణం'' పేరిట విశాఖ పౌర గ్రంథాలయంలో మాస్టారు ప్రతిభావంతంగా మలిచిన పెరెన్నికగన్న కథల్ని పలువురు సాహితీవేత్తలు సమీక్షించారు. ‘‘కారా - కథాచర్వణం'' శీర్షికన ‘అప్రజ్ఞాతం' కథను నల్లూరి రుక్మిణి, ‘మహదాశీర్వచనం'ను డాక్టర్ కాత్యాయినీ విద్మహే, ‘స్నేహం'ను కలశపూడి శ్రీనివాసరావు, ‘జీవధార'ను అయ్యగారి సీతారత్నం, ‘సంకల్పం'ను వర్మ, ‘అనె్నమ్మనాయురాలు'ను అట్టాడ అప్పలనాయుడు, ‘కారా సృష్టి - మారా కృషి'ని మన్నం రాముడు స్థూలంగా సమీక్షించారు.

కారా కథలపై కవనశర్మ

కారా కథలపై కవనశర్మ

తొలుత ఉత్సవ కమిటీ అధ్యక్షులు కవనశర్మ ప్రసంగిస్తూ ప్రజా జీవితంలో మమేకమైన సంఘటనలతో, వ్యవస్థలోని బాగోగుల్ని తన రచనల్లో హృద్యంగా ప్రతిఫలింపజేసిన మహామనిషి కారా మాస్టారు అని కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+