ఢిల్లీలో కెసిఆర్: చంద్రబాబుకు సహకరిస్తా (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినందున ఈ రెండింటిలో ఏ ఒక్క రాష్ట్రానికి ఏం చేసినా.. రెండో రాష్ట్రానికి కూడా అదే చేయాలని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆంధ్రాకు కల్పించినప్పుడు తెలంగాణకు, తెలంగాణకు కల్పించినప్పుడు ఆంధ్రాకూ కల్పించాల్సిందేనని, లేదంటే ఎవరో ఒకరు నష్టపోతారని అన్నారు.
రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తొలి ప్రాధాన్యం ఇస్తే తాను చాలా సంతోషిస్తానని, ఇందులో తప్పేమీ లేదని, దీన్ని తాను కూడా స్వాగతిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పట్ల తమ పార్టీ తటస్థవైఖరి అవలంబిస్తుందని తెలిపారు.
తాను కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి, రాష్ట్రపతిల సహాయం కోరేందుకే ఢిల్లీ వచ్చానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు 40 నిమిషాలు మాట్లాడానని, రాష్ట్ర విభజన బిల్లులో తెలంగాణకు ఇచ్చిన చట్టపరమైన హామీలు, రైల్వేకు సంబంధించి తెలంగాణకున్న అవసరాల గురించి వినతి పత్రం సమర్పించానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు వందశాతం శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేసీఆర్ అన్నారు. ఆయన నాయకత్వంలో అక్కడి ప్రజలకు శుభం జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు భాష మాట్లాడేవారంతా సుహృద్భావాన్ని కొనసాగించాలని, తెలుగు స్ఫూర్తి కొనసాగాలని, ఉభయ రాష్ట్రాలూ మంచి పద్ధతిలో పరస్పరం సహకరించుకుని అన్నారు.

ఢిల్లీలో సిఎంగా కెసిఆర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటనకు వచ్చారు.

ప్రధానితో 40 నిమిషాలు
ప్రధాని నరేంద్ర మోడీతో కెసిఆర్ ఆదివారంనాడు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇలా కనిపించారు.

ఎన్డిఎ పట్ల తటస్థ వైఖరే
నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం పట్ల తమ పార్టీ తటస్థ వైఖరి అవలంబిస్తుందని కెసిఆర్ చెప్పారు.

బాబుకు వంద శాతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబ నాయుడికి వంద శాతం శుభాకాంక్షలు తెలుపుతున్నామని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబుకు సహకరిస్తా..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తాను సహకరిస్తానని కెసిఆర్ చెప్పారు.

హామీలను అమలు చేయాలి..
రాష్ట్ర పునర్విభజన బిల్లులో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని చంద్రశేఖర రావు కేంద్రాన్ని కోరారు.

పరిష్కారం ఇలా..
రు రాష్ట్రాలు సమస్యలను సామరస్య వాతావరణంలో పరిష్కారాలు చేసుకుంటే మంచిదని కెసిఆర్ అన్నారు అన్నారు.

చంద్రబాబు సహకరించాలి
పొద్దున్న లేస్తే ఇరు రాష్ట్రాలకూ పరస్పర సహకారం కావాలని, అది అందించేందుకు, పుచ్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎంగా పనిచేసిన అనుభవమున్న చంద్రబాబు కూడా ఇంతే సుహృద్బావంతో ఉంటారని కెసిఆర్ ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications