వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి ఇంటికీ నీరు:కెసిఆర్, తెరేష్ ఫ్యామిలీకి చెక్(పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేసి గ్రిడ్‌కు సంబంధించిన అన్ని పనులను సమాంతరంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. సర్వే కోసం రూ. 105 కోట్లను విడుదల చేశారు. సచివాలయంలో మంగళవారం తెలంగాణ తాగునీటి గ్రిడ్‌ పథకంపై అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదికను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే కోసం రూ. 105 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ టి.రాజయ్య, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, లోక్‌సభ సభ్యుడు బాల్క సుమన్‌, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ కార్యదర్శులు నాగిరెడ్డి, రేమండ్‌ పీటర్‌, నర్సింగ్‌రావు, ప్రదీప్‌చంద్ర తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టాలని, అందుకు ఈ గ్రిడ్‌ అత్యంత ప్రాధాన్యత ఉందని కెసిఆర్ చెప్పారు.జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పాలేరు, కిన్నెరసారి, వైరా రామప్ప, ఎల్‌ఎంఇ, ఎంఎండి, కడెం, ఎల్లంపల్లి, కొమురం భీమ్‌, ఎస్‌ఆర్‌ఎస్‌సి, గడ్డెపు, నిజాంసాగర్‌, మంజీరా తదితర ప్రాజెక్టుల నుంచి నీటి ని తీసుకుని పైప్‌లైన్‌ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 25 వేల జనావాస ప్రాంతాలకు తాగు నీరు అందించాలని కెసిఆర్ చెప్పారు.

వాటర్ గ్రిడ్

వాటర్ గ్రిడ్

వాటర్ గ్రిడ్‌రు1.32 లక్షల కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ అవసరమైనందున ఇప్పుడే ఏ రకమైన పైప్‌లైను ఈ గ్రిడ్‌లో పైపులు కూడా తెలంగాణలోనే తయారయ్యేలా కంపెనీలను ఒప్పించాలని, దీనివల్ల రవాణా సులువు అవుతుందని, రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని కెసిఆర్ చెప్పారు.

వాటర్ గ్రిడ్

వాటర్ గ్రిడ్

పైప్‌లైన్‌లు వేస్తున్నప్పుడే, అవసరమైన చోట కరెంటు మోటార్లు బిగించాలన్నారు. గ్రిడ్‌ పనుల కోసం అవసరమయ్యే కరెంటు కోసం ప్రతిపాదనలను, ప్రణాళికలను విద్యుత్‌ శాఖకు పంపాలని చెప్పారు. నీటిని గ్రిడ్‌లోకి తీసుకునే చోట, శుద్ధి చేసే ప్లాంట్‌ల వద్ద సబ్‌ స్టేషన్‌లు నిర్మించాలని సూచించారు. నీటి పారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని మంచినీటి కోసం కేటాయించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున నీటి పారుదల శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు.

వాటర్ గ్రిడ్

వాటర్ గ్రిడ్

వేల కోట్ల రూపాయల వ్యయంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా గ్రిడ్‌ ఏర్పాటు చేస్తున్నందున నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. నాణ్యత పరిశీలన కోసం సీఈ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని చెప్పారు. పైపులు,మోటార్లు కొనుగోలు చేయడానికి నాణ్యతా ప్రమాణాలు పాటించే కంపెనీలను సంప్రదించాలని చెప్పారు.

తెరేష్ బాబు కుటుంబానికి పరామర్శ

తెరేష్ బాబు కుటుంబానికి పరామర్శ

ఇటీవల కాలేయవ్యాధితో మృతి చెందిన ప్రముఖ దళిత కవి, గాయకుడు, సాహితీవేత్త రచయిత పైడి తెరెష్‌ బాబు కుటుంబసభ్యులను మంగళవారం రాత్రి అశోక్‌నగర్‌లోని వారి నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పరామర్శించారు.

తెరేష్ బాబుకు నివాళి

తెరేష్ బాబుకు నివాళి

తెరేష్‌ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి కెసిఆర్ నివాళులు అర్పించారు. అనంతరం తెరేష్‌ బాబు రచించిన పుస్తకాలను పరిశీలించారు.ఆయన భార్య సాహేరా బేగం, కుటుంబసభ్యులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు.

చెక్కు ప్రదానం

చెక్కు ప్రదానం

గతంలో ప్రకటించిన పదిలక్షల రూపాయల చెక్కును తెరేష్ బాబు భార్య సాహేరా బేగానికి కేసీఆర్‌ అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీప్యూటీ సీఎం రాజయ్య

ఈ కార్యక్రమంలో డీప్యూటీ సీఎం రాజయ్య

ఈ కార్యక్రమంలో డీప్యూటీ సీఎం రాజయ్య, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌, ముషీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ముఠాగోపాల్‌ పాల్గొన్నారు. తెరేష్‌బాబు సతీమణి సాహేరా బేగం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Telangana CM K chandrasekhar Rao reviewed with officialas on Telangana drinking water grid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X