చంద్రబాబు, లోకేష్ ఇలా: కెసిఆర్ అలా (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వివిధ కార్యక్రమాలతో బీజిగా గడిపారు. ఆయనను కాపునాడు ప్రతినిధి బృందం కలిసింది. సాయంత్రం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఫలహారం బండి కార్యక్రమానికి హాజరయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సోమవారం పలువురు ప్రముఖులు కలిశారు. మైక్రోసాప్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ ఆయనను కలిసి తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని చెప్పారు. హిందూజ చైర్మన్ అశోక్ హిందూజా కూడా కెసిఆర్‌తో సమావేశమయ్యారు.

కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళాలు అందుకుంటూ కనిపించారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

చంద్రబాబు ఇలా

చంద్రబాబు ఇలా

ఓ అమ్మాయిని ఇలా పలకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిపించారు. ఆమె సమస్యను తెలుసుకున్నారు.

కెసిఆర్‌తో భాస్కర్ ప్రామాణిక్

కెసిఆర్‌తో భాస్కర్ ప్రామాణిక్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ కలిశారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని భాస్కర్ ప్రామాణిక్ హామీ ఇచ్చారు.

కెసిఆర్‌త అశోక్ హిందూజా

కెసిఆర్‌త అశోక్ హిందూజా

హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని కెసిఆర్ చెప్పారు.

విరాళం అందుకుంటూ లోకేష్

విరాళం అందుకుంటూ లోకేష్

టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి కోసం తూర్పు గోదావరి జిల్లా కె. గన్నవరం మండలం యండగంజి గ్రామానికి చెందిన సిహెచ్‌వివిఎస్ఎస్ సుబ్బారావు చౌదరి రూ. 25 వేలు నారా లోకేష్‌కు అందించారు.

బాబుతో కాపునాడు నేతలు

బాబుతో కాపునాడు నేతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సోమవారంనాడు అధ్యక్షుడు విసి నారాయణస్వామి అధ్యక్షతన కాపునాడు నాయకులు కలిసి ఓ వినతిపత్రం అందించారు.

స్వామినాథన్‌తో కెసిఆర్

స్వామినాథన్‌తో కెసిఆర్

హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు.

ఐటిసి ఈడితో కెసిఆర్

ఐటిసి ఈడితో కెసిఆర్

ఐటిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రదీప్ ధోబాలే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు. ఐటిసి తెలంగాణలో పలు యూనిట్లను పెట్టడానికి ముందుకు వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+