ఓటు: బండిపై రఘువీరా, బూత్‌లో బాలయ్య (ఫొటోలు)
హైదరాబాద్: సీమాంధ్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖ నాయకులు తమ ఓటు బుధవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత వారు సిరా మరకలు అంటిన చూపుడు వేలిన ప్రదర్శించారు. చాలా మంది నాయకులు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు.
అనంతపురం జిల్లా హిందూపురం శానససభ స్థానం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు సీమాంధ్రలో ఓటు హక్కు లేదు. ఆయనకు హైదరాబాదులో ఓటు ఉంది. దీంతో ఆయన హిందూపురంలో బుధవారం పోలింగ్ బూత్‌లను సందర్శిస్తూ ఓటింగు సరళిని పరిశీలించారు.
కడప జిల్లా పులివెందులలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి...
తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన తర్వాత ఇలా కనిపించారు.

రఘువీరా రెడ్డి ఇలా...
సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన తర్వాత ఇలా కనిపించారు.

బాలకృష్ణ ఓ పోలింగ్ కేంద్రంలో...
హిందూపురం శాసనసభా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓ పోలింగ్ బూత్‌లో ఇలా కనిపించారు.

కిల్లి కృపారాణి ఇలా..
కాంగ్రెసు శ్రీకాకుళం కాంగ్రెసు అభ్యర్థి, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఓటు వేస్తూ ఇలా కనిపించారు. ఆమె జాతకం ఎలా ఉందో మరి..

ఎడ్ల బండిపై రఘువీరా...
సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి ఎడ్ల బండిని తోలుతూ తన కుటుంబ సభ్యులతో ఇలా కనిపించారు.

ఓటు వేస్తూ షర్మిల..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల కడప జిల్లా పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేస్తూ వైయస్ భారతి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి కడప జిల్లా పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వైయస్ అవినాష్ రెడ్డి ఓటు వేస్తూ..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప లోకసభ అభ్యర్థి అవినాష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అశోక్ గజపతి రాజు..
తెలుగుదేశం పార్టీ నాయకుడు అశోక్ గజపతి రాజు విజయనగరం జిల్లాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బొత్స ఝాన్సీ ఇలా...
పార్లమెంటు సభ్యురాలు, కాంగ్రెసు అభ్యర్థి బొత్స ఝాన్సీ విజయనగరం జిల్లాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బొత్స సత్యనారాయణ ఇలా..
మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో వచ్చి విజయనగరంలో తన ఓటును వేశారు.

రాయపాటి మీడియాతో..
గుంటూరు జిల్లా నర్సాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి ఓటేసిన తర్వాత బుధవారంనాడు మీడియాతో మాట్లాడారు.

పనబాక లక్ష్మి ఇలా..
బాపట్ల లోకసభ కాంగ్రెసు అభ్యర్థి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఓటు వేసిన తర్వాత ఇలా కనిపించారు.

టిజి వెంకటేష్ ఇలా..
కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి టిజి వెంకటేష్ ఓటేసిన తర్వాత ఇలా కనిపించారు.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇలా..
కర్నూలు లోకసభ కాంగ్రెసు అభ్యర్థి, కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఓటేసిన తర్వాత తన చూపుడు వేలిని ప్రదర్శిస్తూ ఇలా కనిపించారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications