వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఎన్నికలు: ఎమ్మెల్యేలకు పని (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో చాలా రోజుల తర్వాత శాసనసభ్యులకు పనిపడింది. వారంతా శుక్రవారం రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రం నుంచి ఆరు స్థానాలు ఉండగా, ఏడుగురు నామినేషన్లు వేయడంతో పోలింగ్ అనివార్యంగా మారింది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చివరి నిమిషంలో ప్రకటించారు.

కాంగ్రెసు మిగులు ఓట్లపై ఆధారపడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కె. కేశవ రావు బరిలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యుల ఓట్లను ఆయన ఆశించారు. అయితే, అనూహ్యంగా కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీకి దిగడంతో కేశవ రావు విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ వల్ల తమ అధికారిక అభ్యర్థులను గెలిపించుకోవడానికి తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల మిగులు ఓట్లను వారికి కేటాయిస్తే ఎలా అనే సందేహం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కేశవ రావుకు రెండో ప్రాధాన్యతా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద కేశవరావు బయటపడ్డారని చెప్పవచ్చు.

సబితా ఇంద్రారెడ్డి ఇలా...

సబితా ఇంద్రారెడ్డి ఇలా...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేసులో ఇరుక్కున్న తర్వాత రాజకీయాలకు కాస్తా దూరంగా ఉంటున్న మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చారు.

తెలుగు సభ్యుడు ఇలా..

తెలుగు సభ్యుడు ఇలా..

తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు బరిలో ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఆ పార్టీ శాసనసభ్యులు ఇలా

బుజ్జగిస్తే మోత్కుపల్లి..

బుజ్జగిస్తే మోత్కుపల్లి..

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అలక వహించిన తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులును ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు బుజ్జగించి ఓటు వేయడానికి తీసుకుని వచ్చారు.

బొత్స సత్యనారాయణ ఇలా..

బొత్స సత్యనారాయణ ఇలా..

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇలా..

ముఖ్యమంత్రి ఓటు..

ముఖ్యమంత్రి ఓటు..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఇలా కనిపించారు.

ఉమా మాధవరెడ్డి ఇలా..

ఉమా మాధవరెడ్డి ఇలా..

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేయడానికి వచ్చిన ఆ పార్టీ శాసనసభ్యురాలు ఉమా మాధవరెడ్డి తదితరులు..

ఈటెల రాజేందర్ ఇలా..

ఈటెల రాజేందర్ ఇలా..

తమ పార్టీ అభ్యర్థి కె. కేశవరావుకు ఓటేయడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, శాసనసభ్యుడు రాజయ్య ఇలా.

కెటిఆర్‌తో వట్టి వసంతకుమార్

కెటిఆర్‌తో వట్టి వసంతకుమార్

రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా శుక్రవారంనాడు కాంగ్రెసుకు చెందిన రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్‌తో తెరాస సభ్యుడు కెటిఆర్ ఇలా..

కన్నా ఇలా..

కన్నా ఇలా..

రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఇతర శాసనసభ్యులు ఇలా శానససభ ఆవరణలో..

హరీష్ రావు, తదితరులు..

హరీష్ రావు, తదితరులు..

రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ఇతరుల మాటలను శ్రద్ధగా వింటూ ఇలా కనిపించారు.

మాణిక్యవరప్రసాద్‌తో కె. కేశవరావు..

మాణిక్యవరప్రసాద్‌తో కె. కేశవరావు..

రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంత్రి మాణిక్యవరప్రసాద్‌తో తెరాస అభ్యర్థి కె. కేశవరావు ఇలా... తనకున్న సాన్నిహిత్యంతో కెకె మంత్రి ఓటు అడిగారా.

టిడిపి మహిళా ఎమ్మెల్యేలు..

టిడిపి మహిళా ఎమ్మెల్యేలు..

రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటేయడానికి వచ్చిన తెలుగుదేశం మహిళా శాసనసభ్యులు ప్రాంతాలకు అతీతంగా ఇలా..

దగ్గుబాటి తిరస్కరణ ఓటు..

దగ్గుబాటి తిరస్కరణ ఓటు..

కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు వేసి, ఆశ్చర్యం కలిగించారు.

జెపి ఇలా టీ ఎమ్మెల్యేలతో..

జెపి ఇలా టీ ఎమ్మెల్యేలతో..

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటేసిన లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ తెలంగాణకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్. దామోదర రెడ్డితో మాట్లాడుతూ కనిపించారు.

కెవిపికి జయసుధ ఓటు..

కెవిపికి జయసుధ ఓటు..

జయసుధ, తదితర హైదరాబాద్ శాసనసభ్యుల ఓట్లను కెవిపి రామచంద్ర రావుకు కేటాయించడంపై కాంగ్రెసు తెలంగాణ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

ఆనం వివేకా ఓటు..

ఆనం వివేకా ఓటు..

తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జానారెడ్డితో ఖాన్..

జానారెడ్డితో ఖాన్..

తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డితో కాంగ్రెసు రాజ్యసభ అభ్యర్థి ఎంఎ ఖాన్ ఇలా.. తెలంగాణ శాసనసభ్యులు మొదటి ప్రాధాన్యత ఓటు ఖాన్‌కు వేశారు.

మజ్లీస్ సభ్యులతో ఖాన్, జానా

మజ్లీస్ సభ్యులతో ఖాన్, జానా

మజ్లీస్ శాసనసభ్యులతో ముచ్చటిస్తూ తెలంగాణకు చెందిన మంత్రి కె. జానా రెడ్డి, కాంగ్రెసు రాజ్యసభ అభ్యర్థి ఖాన్ ఇలా కనిపించారు.

రేవంత్ రెడ్డి, గాదె నవ్వుతూ..

రేవంత్ రెడ్డి, గాదె నవ్వుతూ..

రాష్ట్ర విభజనపై ఉత్తరదక్షిణ ధ్రువాలుగా కనిపించే తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి నవ్వులు చిలరికరిస్తూ ఇలా కనిపించారు.

ఖాన్‌తో అక్బరుద్దీన్ ఓవైసీ..

ఖాన్‌తో అక్బరుద్దీన్ ఓవైసీ..

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెసు అభ్యర్థి ఎంఎ ఖాన్‌తో ఇలా కనిపించారు.

English summary
Andhra Pradesh MLAs have franchised their voting right in Rajyasabha elections. Withdrawing from contest Adala Prabhakar Reddy voted for T Subbirami Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X