వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హల్‌చల్: ఓటేసిన మోహన్ బాబు ఫ్యామిలీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుపతి: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులు బుధవారం చిత్తూరు జిల్లా రంగంపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్‌కు వచ్చిన మోహన్ బాబు ఓటర్లతో కలిసిపోయి మాట్లాడుతూ కనిపించారు. మంచివారికి ఓటేయాలని ఆయన సూచించారు.

తన కుమారుడు మంచు విష్ణు, తల్లితో కలిసి వచ్చి ఆయన ఓటు వేశారు. తన తల్లి నడవలేని స్థితిలో ఉన్నారని, ఆమె ఓటు తాను వేయవచ్చునా అని అడిగారు. పోలింగ్ అధికారులు కుదరదని చెప్పడంతో ఆయన తల్లితో ఓటేయించారు.

మోహన్ బాబు స్వస్థలం చంద్రగిరి శాసనసభా నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఆయన కాసేపు క్యూలో నిల్చున్నారు. అక్కడి ఓటర్లతో పిచ్చాపాటీగా మాట్లాడారు. మంచివారికి ఓటేయాలని చెప్పారు. ఎవరికి ఓటేశావో చెప్పవద్దు గానీ మంచివారికి ఓటేయాలని ఓ మహిళకు సూచించి ఆయన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. తన తల్లితో ఆయన ఓటేయించారు.

ఓటేయడానికి వచ్చిన మోహన్ బాబు

ఓటేయడానికి వచ్చిన మోహన్ బాబు

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు రంగంపేట పోలింగ్ బూత్‌లో ఓటేయడానికి ఆయన ఇలా వచ్చారు.

తల్లితో పాటు వచ్చిన మోహన్ బాబు

తల్లితో పాటు వచ్చిన మోహన్ బాబు

తన తల్లిని ఓటేయడానికి మోహన్ బాబు తీసుకుని వచ్చారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు మంచు విష్ణు కూడా ఉన్నారు.

మంచివారికి ఓటేయాలని..

మంచివారికి ఓటేయాలని..

ఓటు వేయడానికి క్యూలో నించున్న ఓ మహిళతో మోహన్ బాబు మాట్లాడుతూ ఎవరికి ఓటేశావో చెప్పవద్దని, కానీ మంచివారికి ఓటేయాలని అన్నారు.

సరదాగా మోహన్ బాబు

సరదాగా మోహన్ బాబు

మోహన్ బాబు పోలింగ్ బూత్ వద్ద ప్రజలతో కలిసి సరదాగా కనిపించారు. వారితో మాట్లాడారు.

కాసేపు క్యూలో నించున్నారు

కాసేపు క్యూలో నించున్నారు

తన ఓటు వేయడానికి మోహన్ బాబు కాసేపు క్యూలో నించున్నారు. ఆయన పక్కనే మంచు విష్ణు ఉన్నారు.

ఓటేసే సమయంలో ఇలా..

ఓటేసే సమయంలో ఇలా..

ప్రముఖ సినీ నటుడు ఓటు వేసే సమయంలో ఇలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. పోలింగ్ సిబ్బందితో సరదాగా మాట్లాడారు.

మంచు విష్ణు ఇలా..

మంచు విష్ణు ఇలా..

తండ్రి మోహన్ బాబుతో పాటు హీరో మంచు విష్ణు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన తర్వాత ఇలా..

ఓటు వేసిన తర్వాత ఇలా..

ఓటు వేసిన తర్వాత మోహన్ బాబు సిరా చుక్క అంటిన తన చూపుడు వేలిని చూపిస్తూ ఇలా కనిపించారు

అమ్మ ఓటు వేయవచ్చా..

అమ్మ ఓటు వేయవచ్చా..

తన తల్లి నడవలేని స్థితిలో ఉన్నారని, ఆమె ఓటు తాను వేయవచ్చునా అని మోహన్ బాబు పోలింగ్ సిబ్బందితో అన్నారు. అలా కుదరదని వారు చెప్పారు

అమ్మతో ఓటేయించారు

అమ్మతో ఓటేయించారు

తన తల్లిని పోలింగ్ బూత్‌లోకి తీసుకుని వచ్ిచ మోహన్ బాబు ఆమె చేత ఓటు వేయించారు.

మీడియాతో మోహన్ బాబు

మీడియాతో మోహన్ బాబు

ఓటేసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో నీచాతినీచంగా వాగ్దానాలు చేస్తున్నారని, రాజకీయ నాయకుల్లో స్వార్థం పెరిగిపోయిందని ఆయన విమర్శించారు.

English summary
Film actor Mohan Babu voted at Rangampet in chittoor district along with manchu Vishnu.Polling began for 25 Lok Sabha seats and 175 assembly seats in Seemandhra. About 3.68 crore voters will franchise their voting right.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X