పవన్ కళ్యాణ్, చంద్రబాబు: యే దోస్తీ (పిక్చర్స్)
హైదరాబాద్: సీమాంధ్రలో బుధవారం పోలింగ్ ముగిసింది. ఇంకా ఎన్నికల వేడి అక్కడ చల్లారలేదు. హైదరాబాదులో మాత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం విందు సమావేశంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు తన ఇంటికి విందుకు ఆహ్వానించారు.
చంద్రబాబు అహ్వానాన్ని పవన్ కళ్యాణ్ మన్నించారు. వారిద్దరి సమావేశంలో చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ కూడా సందడి చేశారు. సీమాంధ్రలో ఓటింగ్ సరళిపై, తమకు వచ్చే సీట్ల అంచనాపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్‌తో భవిష్యత్తులో కూడా స్నేహసంబంధాలను కొనసాగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు ఈ తాజా పరిణామం తెలియజేస్తోంది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏకతాటిపై నడిచే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

చంద్రబాబు ఇంట్లో పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలింగ్ ముగియడంతో చాలా తాజాగా కనిపించారు. గడ్డం తీసేసి, తాజాగా చంద్రబాబు ఇంటికి వచ్చారు.

చంద్రబాబు ఇంట్లో పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమావేశంలో నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. నారా లోకేష్ ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

జగన్‌కు చంద్రబాబు హెచ్చరిక
పవన్ కళ్యాణ్ తన నివాసానికి రావడానికి ముందు చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.

అధికారంపై ధీమా...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో అధికారంపై ధీమా వ్యక్తం చేశారు. తమకు 120 - 130 శాసనసభా స్థానాలు వస్తాయని చెప్పారు.

పవన్ కళ్యాణ్‌కు సాదర స్వాగతం
తన నివాసానికి విందు ఆహ్వానంపై వచ్చిన పవన్ కళ్యాణ్‌కు కుమారుడు లోకేష్‌తో కలిసి చంద్రబాబు సాదర ఆహ్వానం పలికారు.












Click it and Unblock the Notifications