తెలంగాణ తల్లిలా సోనియా, ఆంధ్ర శిల్పి పని (పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకరరావు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి కంకణం కట్టుకున్నారు. ఇందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతిష్టించ తలపెట్టిన సోనియా గాంధీ విగ్రహం మట్టి నమూనా సిద్ధమైంది శంకర రావు తెలిపారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరుకు చెందిన శిల్పి ప్రొఫెసర్ ప్రసాద్ రూపొందించిన సోనియా గాంధీ విగ్రహం తెలంగాణ తల్లిలా ఉంటుందని ఆయన చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం బొమ్మలూరుకు వెళ్లిన శంకరరావు నమూనాను పరిశీలించి అదే తరహాలో కాంస్య విగ్రహం తయారీకి పచ్చజెండా ఊపారు.
ఆ తర్వాత ఆయన కొద్ది మంది మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి వివరాలు వెల్లడించారు. విగ్రహాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోని తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రతిష్టిస్తామని ఆయన చెప్పారు.

సోనియా విగ్రహం మట్టి నమూనా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని పార్టీ శాసనసభ్యుడు పి. శంకరరావు నిర్ణయించుకున్నారు. ఆ విగ్రహం మట్టి నమూనా తయారైంది.

శ్రీ సాయిబాబా మెగా శిల్పశాలలో..
సోనియా గాంధీ విగ్రహం బొమ్మలూరులోని శ్రీసాయిబాబు మెగా శిల్పశాలలో రూపుదిద్దుకుంటుంది. ఆమె తెలంగాణ తల్లిని పోలి ఉంటారు.

శంకరరావు తన కూతురుతో..
బొమ్మలూరులో తయారైన సోనియా గాంధీ మట్టి విగ్రహం నమూనా వద్ద మాజీ మంత్రి పి. శంకరరావు, ఆయన కూతురు సుస్మిత ఇలా...

కుటుంబ సభ్యులతో శంకరరావు..
తెలంగాణ తల్లిలా రూపుదిద్దకుంటున్న సోనియా విగ్రహం మట్టి నమూనా వద్ద కుటుంబ సభ్యులతో మాజీ మంత్రి పి. శంకరరావు ఇలా.












Click it and Unblock the Notifications