జోష్‌తో వెళ్లి అనంత విషాదంతో ఇలా... (పిక్చర్స్)

హైదరాబాద్: విజ్ఞాన యాత్రకు వెళ్లే ముందు విద్యార్థులు ఇంతటి పెను విషాదం చుట్టుముడుతుందని ఊహించి ఉండరు. విజ్ఞాన యాత్ర విషాదయాత్రగా మారుతుందని కలలో కూడా కనిపెట్టి ఉండరు. పొంచి ఉన్న ముప్పు ఎవరికి మాత్రం తడుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థులను కొంత మంది బియాస్ నది ముంచేసింది.

తమతో నిన్నమొన్నటి వరకు కలిసి ఉన్నవారు తమతో ఉంటూనే తమకు కాకుండా పోయారనే విషాదాన్ని బతికి ఉన్న విద్యార్థులు తట్టుకోవడం కష్టమే. ఆ విషాదం కట్టెదుట దయ్యంలా నెత్తి విరబోసుకుని నిలబెడితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది..

ఆదివాంనాడు హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో నలుగురి మృతదేహాలు దొరికాయి. ఆ మృతదేహాలతో పాటు కొంత మంది విద్యార్థులు సోమవారం రాత్రి హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయి.

కళ్ల ముందే మాయమైతే...

కళ్ల ముందే మాయమైతే...

తమతో పాటు ఆడుతూ పాడుతూ తుళ్లుతూ తిరిగిన సహ విద్యార్థులు ఇక లేరని తలుచుకున్నప్పుడు శోకం దీప్తిని ముంచెత్తినట్లుగానే ఉంటుంది.

కుటుంబ సభ్యులకు ఊరట..

కుటుంబ సభ్యులకు ఊరట..

అనంత శోకాన్ని తన కుటుంబ సభ్యులతో పంచుకుంటున్న విద్యార్థిని దీప్తి. ఆమె కుటుంబ సభ్యులకు తమ అమ్మాయి బతికి ఉన్నందుకు ఊరట..

ఇలా ఓ విద్యార్థిని...

ఇలా ఓ విద్యార్థిని...

ప్రమాదం నుంచి కొన్ని నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడం వల్ల బయటపడినవారిలో ఈ అమ్మాయి ఉంది. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆ విద్యార్థిని గుండెలో విషాదం గూడు కట్టుకుంది.

తమ పిల్లాడు బతికి ఉన్నందుకు..

తమ పిల్లాడు బతికి ఉన్నందుకు..

తమ పిల్లవాడు ప్రమాదానికి గురి కాకపోవడం ఆ కుటుంబానికి సంతోషాన్నిస్తుండవచ్చు. కానీ ఆ విద్యార్థి మనసు నుంచి ఆ విషాద ఘటన రూపుమాసిపోతుందా..

శంషాబాద్ విమానాశ్రయ చేరుకున్నారు..

శంషాబాద్ విమానాశ్రయ చేరుకున్నారు..

బియాస్ ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థినులు శంషాబాద్ విమానాశ్రయానికి సోమవారం రాత్రి చేరుకున్నప్పుడు..

ఇలా జరిగిందేమిటి...

ఇలా జరిగిందేమిటి...

బియాస్ నది నుంచి చండీఘడ్‌కు ఆ తర్వాత హైదరాబాదు విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థినులు ఇలా..

ఇంతలోనే ఎంత జరిగింది...

ఇంతలోనే ఎంత జరిగింది...

ఈ నెల 3వ తేదీన విజ్జాన యాత్రకు వెళ్తున్నప్పుడు ఇంతటి పెను ముప్పు దాపురిస్తుందని వీరు అనుకుని ఉండరు. బయటపడి ఇలా వచ్చారు.

ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు..

ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు..

తమ అమ్మాయి బతికి బయటపడినందుకు ఆమె కుటుంబ సభ్యులు ఆనందిస్తూనే ఉండవచ్చు. కానీ ప్రమాదం జ్ఞాపకాలు ఆమెను కలిచివేస్తూనే ఉంటాయా..

పోయినోళ్లు అందరూ...

పోయినోళ్లు అందరూ...

పోయినోళ్లు అందరూ మంచోళ్లో... తన సహ విద్యార్థులను పోగొట్టుకుని నిస్సత్తువగా హైదరాబాదు చేరుకున్న ఓ విద్యార్థిని ఇలా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+