ముగ్గురిపై రెక్కీ: మాజీ నక్సలైట్, కరుడు గట్టిన కిరాతకుడు (పిక్చర్స్)

హైదరాబాద్: డబ్బు కోసం కిడ్నాప్ చేయడం, డబ్బు చేతికి వచ్చినా రాకపోయినా వారిని హత్య చేయడం వంటి దారుణమైన నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. భారీ కిడ్నాప్ యత్నాన్ని తిప్పికొట్టారు.

ముఠాలో ఓ మాజీ నక్సలైట్‌తో పాటు నేరాల్లో ఆరితేరిన మరో వ్యక్తి ఉన్నాడు. మాజీ నక్సలైట్‌తో పాటు నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ చేసి, డబ్బులు లాగేందుకు ఆ ముఠా ముగ్గురు వ్యక్తులపై రెక్కీ నిర్వహించింది.

హైదరాబాదులోని హిమాయత్ నగర్‌లో ఓ మెస్ యజమాని, యాప్రాల్ బాలాజీనగర్ చెందిన వైన్ షాపు యజమాని, నల్లగొండ జిల్లా ఆలేరులో ఓ ఆలయ ట్రస్టీని కిడ్నాప్ చేయడానికి ఆ ముఠా పథకం వేసింది.

ఆయుధాలు స్వాధీనం

ఆయుధాలు స్వాధీనం

తమ పథకాన్ని అమలు చేసేందుకు ముఠాలోనిి వర్మ, రాజిరెడ్డి ఉత్తరప్రదేశ్ వెళ్లి అనుపమ్ అనే వ్యక్తికి 60 వేల రూపాయలు చెల్లించి ఒక పిస్తోల్, ఒక తపంచా, బుల్లెట్లు కొనుగోలు చేశారు.

గ్యాంగ్ ఇలా..

గ్యాంగ్ ఇలా..

అప్పల త్రినాథ్ వర్మ అలియాస్ రఘువర్మ అలియాస్ రాజేష్ (32) జె నాగరాజు, డి. దామోదర్‌లతో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు.

రాజిరెడ్డి మాజీ నక్సలైట్

రాజిరెడ్డి మాజీ నక్సలైట్

ముఠాలోని ఓ వ్యక్తి మాజీ నక్సలైట్ కె. రాజిరెడ్డి. గతంలో మెదక్ జిల్లా గిరాయిపల్లి దళంలో 1988 నుంచి 1992 వరకు నక్సలైట్‌గా పనిచేసి లొంగిపోయాడు

గ్యాంగ్ సూత్రధారి

గ్యాంగ్ సూత్రధారి

గ్యాంగ్ ప్రధాన సూత్రధారి ఎస్ అప్పల త్రినాథ్ వర్మ అతి కిరాతకుడు. కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసిన తర్వాత హత్య చేయడం అతని నైజం.

గతంలో ఇలా..

గతంలో ఇలా..

2012లో అమలాపురంలో మరో ముఠాతో కలిసి సత్యనారాయణరాజు అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. డబ్బు తీసుకుని తర్వాత నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకుని హత్య చేశాడు. ఆ కేసులో మిగతా నిందితులు అరెస్టు కాగా వర్మ తప్పించుకుని తిరుగుతున్నాడు.

బంగారం వ్యాపారిని ఇాల..

బంగారం వ్యాపారిని ఇాల..

కెపిహెచ్‌బిలో బంగారం వ్యాపారిని బంగారం కొంటామని నమ్మించి తమ వద్దకు రప్పించి వర్మ అతన్ని అరెస్టు చేశాడు. ఈ కేసులో వర్మ అరెస్టయి జైలుకెళ్లి వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+