టెక్కీ: భార్యాకుమారుల హత్య, ఆత్మహత్య (పిక్చర్స్)
హైదరాబాద్: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్యను, కుమారుడ్ని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటన హైదరాబాదులో బుధవారంనాడు చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌కుచెందిన మనీష్‌సాహు (36) భార్య శ్వేతసాహు (32), కుమారుడు యేష్‌సాహు (5)తో కలిసి మాదాపూర్‌లోని మైహోంహబ్ మొదటి అంతస్తులోని 108 ఫ్లాటులో నివాసముంటున్నాడు.
మనీష్ మాదాపూర్‌లోని హైమామ్ ఎంధ్యూస్ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం నుంచి మనీష్‌సాహు కంపెనీకి రాకపోవడంతో అధికారులు, స్నేహితులు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయలేదు. కంపెనీలో పనిచేసే శ్రీరాం బుధవారం ఉదయం మనీష్‌సాహు నివాసముంటున్న ఫ్లాట్‌కు వెళ్ళాడు. లోపలి నుంచి దుర్వాసన వస్తుండడంతో అక్కడున్న వారికి తెలియజేయగా వారు సెక్యూరిటీగార్డుకు సమాచారం అందించారు.
అతడొచ్చి తలుపు తెరచి చూడగా మనీష్‌సాహు, అతని భార్య,కుమారుడి మృతదేహాలు కనిపించాయి. శ్వేతసాహు, యేష్‌సాహు ఒంటిపై కత్తితో కోసిన గాయాలున్నాయి. భార్య, కుమారుడ్ని కత్తితో గాయపరచి హత్య చేసిన అనంతరం మనీష్‌సాహు కిటికీకి ఉరివేసుకొన్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు మాదాపూర్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

తండ్రి చేతిలో హతమైన పిల్లాడు..
టెక్కీ మనీష్ సాహు తన భార్యను, కుమారుడిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు యేష్ సాహూ ఛాయాచిత్రం నవ్వులు ఒలకబోస్తూ...

ముచ్చటగా ముగ్గురు..
టెక్కీ మనీష్, భార్య శ్వేత సాహూ, కుమారుడు యేషు సాహూ ఫొటోలు గోడపై ఇలా కనిపిస్తున్నాయి. నిజానికి ఆనందమే ఉండాలి. కానీ..

కత్తితో పొడిచి, తాను ఆత్మహత్య..
టెక్కీ మనీష్ తన భార్యను, కుమారుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత తాను కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ కత్తి ఇదే...
తన భార్య శ్వేతను, కుమారుడు యేసును చంపడానికి మనీష్ వాడిన కత్తి ఇదే.. వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

దంపతుల ఫొటో..
టెక్కీ మనీష్, భార్య శ్వేత సాహూ తీసుకున్న ఫొటో ఇది... ఇంత ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ జంట చచ్చిపోయిందంటే నమ్మడం కష్టమే..












Click it and Unblock the Notifications