ఢిల్లీ సీన్: వెంకయ్యపై ఒత్తిడి, సిఎంపై ఫైర్ (ఫొటోలు)
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు లోకసభలో ఆమోదం పొంది రాజ్యసభకు వచ్చిన నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో వాతావరణం ఇంకా వేడిగానే ఉంది. తెలంగాణ బిల్లును రాజ్యసభలో ఆమోదించడానికి బిజెపి మెలిక పెట్టడంతో తెలంగాణ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్య నాయుడిని తెలంగాణ నాయకులు తప్పు పడుతున్నారు.
వెంకయ్య నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కుమ్మక్కయి తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. సీమాంధ్రకు న్యాయం చేయడానికి ప్రతిపాదనలు చేస్తున్నామనే వెంకయ్య నాయుడి మాటలను వారు సాకుగా మాత్రమే పరిగణిస్తున్నారు.
లోకసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు ఆగలేదు. దీంతో బిజెపి తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లే కనిపిస్తోంది. ఈ ఒత్తిడితోనే, నిందలు మోయాల్సి వస్తుందనే అభిప్రాయంతోనే లోకసభలో బిజెపి నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ బిల్లుకు సవరణలు ప్రతిపాదించకుండా పచ్చజెండా ఊపినట్లు కనిపిస్తున్నారు. అదే రకమైన ఒత్తిడికి వెంకయ్య నాయుడు ప్రస్తుతం గురవుతున్నారు. వెంకయ్య నాయుడు సీమాంధ్రకు చెందినవాడు కావడం వల్ల కూడా ఆ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏమైనా, ఢిల్లీ రాజకీయాలు ఇంకా వేడిగానే ఉన్నాయి.

హైదరాబాద్ యుటిపై అంజన్ కుమార్..
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే సీమాంధ్ర నాయకుల డిమాండ్‌పై సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. బుధవారం ఆయన ఇలా కనిపించారు.

డిఎస్ పెద్ద దిక్కు
ఢిల్లీలో తెలంగాణ నాయకులకు పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పెద్ద దిక్కుగా మారారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి బిజెపి అంగీకరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

షబ్బీర్ అలీ...
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని తెలంగాణ నాయకులు స్వాగతించారు. పీడ విరగడైందని వారు వ్యాఖ్యానించారు.

వెంకయ్యపై దేవీప్రసాద్ విమర్శ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కుమ్మక్కయి బిజెపి రాజ్యసభ సభ్యుడు ఎం. వెంకయ్య నాయుడు రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు మెలిక పెడుతున్నారని తెలంగాణ ఉద్యోగల సంఘం నాయకుడు దేవీప్రసాద్ విమర్శించారు.

సోనియా వల్లే వారికి పదవులు..
సోనియా గాంధీ దయవల్ల అనామకులకు కూడా మంత్రి పదవులు వచ్చాయని, వారంతా సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తెలంగాణకు చెందిన కాంగ్రెసు సీనియర్ నేత డి. శ్రీనివాస్ అన్నారు.

డిఎస్‌తో జెఎసి నేతలు..
రాజ్యసభకు తెలంగాణ బిల్లు వస్తుందని అనుకుంటున్న నేపథ్యంలో బుధవారంనాడు తెలంగాణ జెఎసి నేతలు కోదండరామ్ తదితరులు డి. శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు.

పీడ విరగడైంది..
తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు ఢిల్లీలో ఉంటామంటూ చెప్పిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాపై తీవ్రంగా ప్రతిస్పందించారు. పీడ విరగడైందని ఆయన వ్యాఖ్యానించారు.

జైపాల్ రెడ్డి కీలకం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ఆమోదింపజేయడంలో గత కొంత కాలంగా కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కీలకంగా మారారు. ఆయనతో రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఇలా.

గీతా రెడ్డి ఆశ..
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదించే సమయంలో ఢిల్లీలో ఉండాలనే ఉద్దేశంతో అక్కడికి చేరిన గీతా రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలనే ఆశతో ఆమె ఉన్నట్లు కనిపిస్తున్నారు.

వివేకే ఇలా..
ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు వివేక్, మందా జగన్నాథం ఆహ్వానించారు.

కమల్‌నాథ్‌ను తప్పు పట్టిన విద్యాసాగర రావు
రాజ్యసభలో బుధవారంనాడు తెలంగాణ బిల్లును ప్రతిపాదించకపోవడంపై బిజెపి తెలంగాణ ప్రాంత నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ను తప్పు పట్టారు.

అసదుద్దీన్ ఇలా..
హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలనే నిర్ణయంపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికి మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సిద్ధపడ్డారు.

చిరంజీవి నిరసన..
తెలంగాణ బిల్లు రాజ్యసభకు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి చిరంజీవి బుధవారం సభలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

దేవేందర్ గౌడ్ ఇలా..
చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న తెలంగాణకు చెందిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ తెలంగాణ బిల్లు వస్తుందనే ఉద్దేశంతో బుధవారం రాజ్యసభకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications