జగన్ పుష్కర స్నానం ఇలా: బాబును ఉతికేశారిలా... (పిక్చర్స్)

రాజమండ్రి: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. విఐపిలకు కేటాయించిన ఘాట్లలో చంద్రబాబు పూజలు చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు తప్పించుకుంటున్నారని, ఇదే స్థానంలో ఎవరైనా ఉంటే వారిని జైలుకు పంపించేవారని జగన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విఐపి ఘాట్‌లు ఏర్పాటు చేశారని, ప్రచారం కోసమే సామాన్యుల ఘాట్‌లో రెండున్నర గంటలు చంద్రబాబు పుష్కర పూజలు నిర్వహించారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పునకు విచారణ పేరుతో అధికారులను బలి చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.

విఐపి ఘాట్‌లో పుష్కర స్నానం

విఐపి ఘాట్‌లో పుష్కర స్నానం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద విఐపి ఘాట్‌లో బుధవారం పుష్కర స్నానం ఆచరించారు.

గోష్పాద క్షేత్రానికి...

గోష్పాద క్షేత్రానికి...

పుష్కర స్నానం ఆచరించడానికి జగన్ బుధవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు చేరుకుని అక్కడి గోష్పాద క్షేత్రానికి విచ్చేశారు.

గోదావరి మాతకు పూజలు..

గోదావరి మాతకు పూజలు..

గోష్పాద క్షేత్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి మాతకు పూజలు చేశారు. పుష్కర ఘాట్ వ్దద తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి పిండ ప్రదానం చేశారు.

ఆత్మశాంతికి ప్రార్థనలు..

ఆత్మశాంతికి ప్రార్థనలు..

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించివారి ఆత్మలకు శాంతి కలగాలని జగన్మోహన్ రెడ్డి ప్రార్థించారు.

సిఎం కాబట్టే తప్పించుకుంటున్నారు...

సిఎం కాబట్టే తప్పించుకుంటున్నారు...

చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టే తొక్కిసలాట వల్ల జరిగిన ప్రమాద ఘటన నుంచి తప్పించుకుంటున్నారని జగన్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+