గోషామహల్ పిఎస్‌లో ఎమ్మెల్యేలతో విజయ (ఫొటోలు)
హైదరాబాద్: సస్పెండ్ అయిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులు శానససభ ద్వారం వద్ద ధర్నాకు దిగారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను 15 మందిని స్పీకర్ ఒక రోజు పాటు గురువారం సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్‌కు నిరసనగా పార్టీ శాసనసభా పక్ష నేత వైయస్ విజయమ్మ సభ నుంచి వాకౌట్ చేశారు.
వాకౌట్ చేసిన తర్వాత విజయమ్మ తన పార్టీ శాసనసభ్యులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేడియానికి తరలించారు. శాసనసభ్యులను అరెస్టు చేయడాన్ని శానససభలో తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది.
సమైక్యాంధ్ర కోసం తొలుత తీర్మానం చేసి, ఆ తర్వాత తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ చేయాలని పట్టుబడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. బిల్లుపై చర్చ సాగించే ఉద్దేశంతో ప్రభుత్వ తీర్మానం మేరకు స్పీకర్ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.

గోషా మహల్ పోలీసు స్టేడియంలో... 1
పోలీసులు అరెస్టు చేసి తరలించిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు గోషా మహల్ స్టేడియంలో ఇలా కనిపించారు.

గోషా మహల్ పోలీసు స్టేడియంలో.. 2
గోషా మహల్ పోలీసు స్టేడియంలో వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, తదితరులు.. ఫోన్ మాట్లాడుతూ వైయస్ విజయమ్మ.

గోషా మహల్ పోలీసు స్టేడియంలో.... 3
గోషామహల్ పోలీసు స్టేడియంలో మీడియాతో మాట్లాడుతూ వైయస్ విజయమ్మ ఇలా కనిపించారు. శాసనసభ్యులు కూడా అక్కడే ఉన్నారు.

గోషా మహల్ పోలీసు స్టేడియంలో...4
గోషా మహల్ పోలీసు స్టేడియంలో పోస్టర్లతో, సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులు ఇలా కనిపించారు.

గోషా మహల్ పోలీసు స్టేడియంలో.... 5
జై సమైక్యాంధ్ర పోస్టర్లతో శ్రీకాంత్ రెడ్డి తదితర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు గోషా మహల్ పోలీసు స్టేడియంలో ఇలా కనిపించారు.












Click it and Unblock the Notifications