Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీటీడీ గోశాల ఘటనపై ఆరా తీసిన అసలు నేత

TTD Goshala: ప్రపంచంలోనే అత్యంత పవిత్రక్షేత్రమైన తిరుమలలో వరుస అపచారాలు చోటుచేసుకుంటోండటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తిరుమల లడ్డూపై దుష్ప్రచారంతో ఆరంభమైన ఈ ఉదంతాలు.. చివరికి శ్రీవారి ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించేంత వరకు చేరాయంటూ మండిపడుతోంది.

తిరుపతి లడ్డూ కౌంటర్ల వద్ద తొక్కిసలాట, గోశాలలో గోవుల మృత్యువాత వంటి ఘటనలు సంభవిస్తోన్నాయని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తోంది.

PIL underway says Subramanian Swamy on cows have died at TTD Goshala

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యలో కొనసాగుతున్న గోశాలలో మూడు నెలల్లోనే వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయంటూ టీటీడీ పాలకమండలి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించడం మరింత కలకలం రేపింది. ఇది రాజకీయ రంగు పులుముకుంటోంది.

కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత వరుసగా జరుగుతున్న ఈ గోమరణాలను టీటీడీ ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. దేశంలో గోవును అత్యంత పవిత్రమైన జంతువుగా హిందువులు పూజిస్తుంటారని, సకల దేవతల స్వరూపిణీ అయిన గోమాతకు టీటీడీ గోశాలలో దారుణమైన పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు.

హైందవ ధర్మాన్ని కాపాడతామని, తిరులమ పవిత్రతను రక్షించడమే ధ్యేయంగా పాపప్రక్షాళన చేస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వంలో టీటీడీ గోశాలలో గత మూడు నెలల్లో దాదాపు వందకు పైగా గోవులు మృత్యువాత పడ్డాయని అన్నారు. ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా దాచిపెట్టారని ధ్వజమెత్తారు.

PIL underway says Subramanian Swamy on cows have died at TTD Goshala

టీటీడీ గోశాలలో గోమాత పట్ల జరుగుతున్న పాపానికి చంద్రబాబు, సనాతన ధర్మపరిరక్షణకు కంకణం కట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బదులు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నిత్యం వైఎస్ జగన్‌పై విషం చిమ్మడంలోనే నిమగ్నం అయ్యారని, తిరుమల శ్రీవారిని కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ గత ప్రభుత్వంపై చెప్పలేనంత బుదరచల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీటీడీకి సంబంధించిన పలు అంశాలపై ఆయన గతంలో న్యాయపోరాటానికి సైత దిగిన విషయం తెలిసిందే. ఆయా అంశాలపై జాతీయ స్థాయిలో చర్చకు కారణం అయ్యారు.

Take a Poll

ఇప్పుడు మరోసారి సుబ్రమణ్య స్వామి రంగంలోకి దిగారు. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆరా తీయడం మొదలుపెట్టారు. మూడు నెలల వ్యవధిలో టీటీడీ గోశాలలో గోవులు అనారోగ్యం, సరైన మేత లేకపోవడం వల్ల మరణించాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తోన్నట్లు తెలిపారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, గోవులను సంరక్షించడం, వాటికి సంబంధించిన విధి విధానాల గురించి తాను తెలుసుకుంటోన్నానని, మరింత సమాచారాన్ని సేకరిస్తున్నానని సుబ్రమణ్యస్వామి వెల్లడించారు. గోవుల మరణం వెనుక నిజనిజాలు ఏమిటనేది వెల్లడి కావడానికి త్వరలోనే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేస్తానని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+