శ్రీశైలంలో చిక్కుకుపోయిన వేలాది మంది కర్ణాటక భక్తులు: అసలేం జరిగిందంటే.?
కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వేలాది భక్తులు చిక్కుకుపోయారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే కేఎస్ఆర్టీసీ బస్సులు సమ్మె కారణంగా నిలిచిపోవడంతో భక్తులు ఇక్కడే వుండిపోయారు. కాగా, శ్రీశైలం చేరుకునేందుకు తొలిసారి రాత్రి 9 గంటల తర్వాత బస్సులను ఘాట్ రోడ్డు మీదుగా అనుమతించారు.

కర్ణాటక నుంచి నడకదారినే శ్రీశైలంకు భక్తులు
గత కొన్ని సంవత్సరాలుగా అటవీ శాఖ అధికారులు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఘాట్ రోడ్డుపై రవాణాను నిలిపివేశారు. రాత్రిపూట ప్రయాణాలను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. గత రెండ్రోజులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన అనేక మంది భక్తులు నడకద్వారానే శ్రీశైలం పుణ్యక్షేత్రం చేరుకుంటున్నారు.

శ్రీశైలం చేరుకున్న కర్ణాటక భక్తులు.. తిరిగి వెళ్లేదెలా?
ప్రస్తుతం వారంతా తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాలంటే కర్ణాటక నుంచి సమ్మె కారణంగా కేఎస్ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం నుంచి కేఎస్ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని 13 జిల్లాల నుంచి శ్రీశైలంకు స్వామివారి దర్శనం కోసం భక్తులు చేరుకున్నారు. బీజాపూర్, హవేరీ, బళ్లారి, గుల్బర్గా, రాయచూర్, బీదర్, హుబ్బలి, బెంగళూరు, తంకూరు ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చారు.

కన్నడ భక్తుల కోసం ఏపీ బస్సులు
శ్రీశైలంకు 20 బస్సులను గురువారం పంపించామని కర్నూలు ఏపీఆర్టీసీ రీజనల్ మేనేజర్ టీ వెంకటరామమ్ తెలిపారు. కొంత సమస్య ఏర్పడినప్పటికీ.. ఆ తర్వాత క్లియర్ చేయడం జరిగిందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం పంపిన 150 లను కూడా తిరిగివచ్చిన తర్వాత శ్రీశైలం పంపుతామని చెప్పారు. శ్రీశైలం నుంచి కర్నూలుకు భక్తులను తీసుకొచ్చి.. ఇక్కడ్నుంచి వారి వారి స్వస్థలాలకు లింక్ సర్వీసుల ద్వారా తరలిస్తామని తెలిపారు.

కరోనా కారణంగానే వెనుదిరుగుతున్న భక్తులు
సాధారణంగా ఏప్రిల్ 13న ఉగాది రోజు జరిగే రథోత్సవం వరకు కూడా కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు ఇక్కడే ఉంటారని, అయితే, కరోనా మహమ్మారి కారణంగా భక్తులు తిరిగి వెళ్లిపోయేందుకు మొగ్గుచూపుతున్నారని శ్రీశైలం ఆలయ అధికారి ఒకరు తెలిపారు.
ఇక్కడ చిక్కుకుపోయిన భక్తులను వారి గమస్యస్థానాలకు తరలించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బస్సులను కూడా పంపాలని కోరామని మరో ఆలయ అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications