ఆస్తి తగాదాలు: పిస్టల్‌తో కాల్పులు, ఒకరి పరిస్ధితి విషమం
నెల్లూరు: జిల్లాలో ఆస్తికోసం ఒక వ్యక్తి మరో వ్యక్తిపై పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. తోటపల్లి గూడూరు మండలంలోని పీడీ కండ్రిగ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, రంగినేని కిరణ్ అతడి సమీప బంధువు వేముల రూపకుమార్ మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదలున్నాయి.

ఈ నేపథ్యంలో బుధవారం కిరణ్‌ను, రూప కుమార్ పిస్టల్‌తో కాల్చాడు. ఈ ఘటనలో కిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని నెల్లూరులోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications