వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై కేంద్రం మొండిగా వెళ్తే మేము అంతే మొండి: పితాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pitani Satyanarayana
హైదరాబాద్: విభజనపై కేంద్రం మొండిగా వెళ్తే తాము అంతే మొండిగా వెళ్తామని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. విభజన విషయంలో కేంద్రమంత్రులు, ఢిల్లీ పెద్దలు భిన్న ప్రకటనలతో గందరగోళపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనపై వారు మొండిగా ముందుకు వెళ్తే సమైక్యాంధ్ర కోసం తాము మొండిగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్ర విభజన విషయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కారని విమర్శించారు. ఆంటోని కమిటీ ఏం చేసిందో ఎవరికీ తెలియదన్నారు. ఇప్పుడు మంత్రుల బృందం రాష్ట్రానికి వస్తుందో రాదో తెలియదన్నారు. భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా సీమాంధ్ర కాంగ్రెసు నేతలమంతా సమష్టిగా తీసుకుంటామని చెప్పారు.

టిడిపి బండారం బట్టబయలు: జోగి

స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన నోట్‌తో తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామాలు అంటూ ఆడుతున్న నాటకాలు బయటపడ్డాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జోగి రమేష్ వేరుగా విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లాగే ఆ పార్టీ ఎంపీలు నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ మాత్రమే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు.


కుట్రతోనే సమైక్య శంఖారావంకు అనుమతివ్వలేదు: కొణతాల

తమ సమైక్య శంఖారావ యాత్రకు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు కుట్రతోనే అనుమతి ఇవ్వలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ హైదరాబాదులో అన్నారు. ఇది కాంగ్రెసు కుట్రలో భాగమన్నారు. రాజ్యాంగ సంక్షోభానికి కిరణ్ అడ్డుపడుతున్నారని, ఆస్తులు కాపాడుకోవడానికే కేంద్రమంత్రులు దృష్టి పెడుతున్నారని ఆరోపించారు.

English summary

 Minister Pitani Satyanarayana on Tuesday lashed out at Central Government for Andhra Pradesh division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X