సిఎం మార్పు: నిజమని పితాని, అనవసరమని పొన్నం

హైదరాబాద్: ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందని తాను నమ్ముతున్నట్లు మంత్రి పితాని సత్యనారాయణ గురువారం చెప్పారు. మార్పుపై తాను మీడియాలో చూస్తున్నానని, అది వాస్తవమేననిపిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రిని మార్చి ఎవరిని ఆ పీఠంపై కూర్చుండబెట్టినా ఆ ప్రాంత ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని పితాని అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యం విషయంలో డబుల్ గేమ్ ఆడటం లేదన్నారు. రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పైన విమర్శలు చేసే వారంతా అవగాహనారాహిత్యంతో వ్యాఖ్యానిస్తున్నారని ఆయన విమర్శించారు.

pitani satyanarayana and ponnam prabhakar

మాకు అనవసరం: పొన్నం

ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ప్రచారంపై తమకు ఆసక్తి లేదని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. తమకు ముఖ్యమంత్రి మార్పు విషయం అనవసరమని, తెలంగాణ ఏర్పాటు చాలా ముఖ్యమన్నారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డిల వ్యాఖ్యలను తాము పట్టించుకోమన్నారు. ఎవరు ఏం చెప్పినా విభజన ఆగే సమస్య లేదన్నారు. కాంగ్రెసు పార్టీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక అభిప్రాయం ఎందుకు చెప్పలేకపోయారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+