Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త చెప్పిన పవన్ కల్యాణ్

తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆలయాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. భారీగా నిధులను మంజూరు చేశారు. శక్తిపీఠం శ్రీపురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాలు, శ్రీపాద శ్రీవల్లభ పీఠం వంటి ఆలయాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికను వేగంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు.

ప్రఖ్యాత ఆలయాలతోపాటు నియోజకవర్గంలో జీర్ణావస్థకు చేరిన ఆలయాలను ఇప్పటికే గుర్తించామని, వాటికి పునరుజ్జీవం కల్పించే పనులుకు అవసరమైన నిధులు దేవాదాయ శాఖ సమకూర్తుస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. దేవాదాయ శాఖ సహకారంతో ఆలయాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని అన్నారు. నియోజకవర్గం పరిధిలోని 19 ఆలయాల పునరుద్ధరణకు కామన్ గుడ్ ఫండ్ నుంచి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు ఇప్పటికే దేవాదాయ శాఖ అంగీకరించిందనీ, మ్యాచింగ్ గ్రాంట్ తో నిధులు మంజూరు అవుతాయని అన్నారు.

Pithapuram is the Next Spiritual Tourism Hotspot in Andhra Pradesh

పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పవన్ కల్యాన్ వివరించారు. అందులో భాగంగా దేవాలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజంలో భాగంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రితో చర్చించి పిఠాపురం పరిధిలోని ఆలయాల అభివృద్ధికి నిధులు కోరామని, ప్రధాన ఆలయాలతో పాటు మొత్తం 19 ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని వివరించారు.

శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సుమారు రూ.6 కోట్లు వెచ్చించి పిండ ప్రదాన మండపం, అన్నదాన మండప నిర్మాణంతోపాటు కోనేరు మరమ్మతులు చేపట్టేందుకు కామన్ గుడ్ ఫండ్ నుంచి ఇప్పటికే నిధులు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ ఆమోదం లభించిందని పేర్కొన్నారు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయం అభివృద్ధికి రూ.2 కోట్లు కామన్ గుడ్ ఫండ్ ద్వారా మ్యాచింగ్ గ్రాంట్ తో మంజూరు అయ్యింది.

పిఠాపురం శ్రీ సీతారామాంజనేయ ఆశ్రమం అభివృద్ధికి రూ.60 లక్షలు, శ్రీ జై గణేష్ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.65 లక్షలు, చిత్రాడలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.70 లక్షలు కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ అంగీకరించిందని అన్నారు. నవఖండ్రవాడలోని శ్రీ నక్కుల్లమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ రామాలయం, గొల్లప్రోలు శ్రీ సిరితల్లి ఆలయం, తాటిపర్తిలోని శ్రీ మార్కండేయసహిత భద్రావతి భావనరుషి స్వామి వారి ఆలయాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ధూప దీప నైవేధ్యం పథకం పరిధిలోకి తీసుకునేందుకు దేవాదాయ శాఖ అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+