ఎమ్మెల్సీ పదవి పై వర్మ కీలక వ్యాఖ్యలు - కేడర్ కు పిలుపు..!!
కూటమిలో ఎమ్మెల్యేల కేటాయింపు పూర్తయింది. అభ్యర్ధులు ఖరారయ్యారు. ఎమ్మెల్సీల పైన ఆశలు పెట్టుకున్న సీనియర్లకు అవకాశం దక్కలేదు. బీజేపీ - జనసేనకు చెరో స్థానం కేటాయించ గా.. టీడీపీకి మూడు స్థానాలు దక్కాయి. పవన్ కోసం పిఠాపురంలో సీటు త్యాగం చేసి.. ఆయన గెలు పులో కీలక పాత్ర పోషించిన వర్మకు ఈ సారి ఎమ్మెల్సీ సీటు ఖాయమని భావించారు. ఈ సారి కూ డా అవకాశం దక్కలేదు. తనకు సీటు దక్కకపోవటం పైన వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కేడర్ కు కీలక పిలుపునిచ్చారు. ఇప్పుడు వర్మ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఎమ్మెల్సీ సీటు పై ఆశలు
టీడీపీ సీనియర్ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తనకు ఎమ్మెల్సీ సీటు దక్కకపోవటం పైన స్పందించారు. ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో వర్మ ఈ సారి భారీగా ఆశలు పెట్టుకున్నారు. కూటమిలో సీట్ల సర్దుబాటు.. కేటాయింపుల వేళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పళ్లా శ్రీనివాస రావు నేరుగా వర్మకు ఫోన్ చేసి ఈ సారి సీటు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. మలి విడతలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవటం పైన ఆయన మద్దతు దారులు అసహనం వ్యక్తం చేసారు. దీంతో, వర్మ ఇప్పుడు తనకు సీటు రాని అంశం పైన స్పందించారు. తన వైఖరి పై క్లారిటీ ఇచ్చారు.

వర్మ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు తో 23 ఏళ్లుగా తన రాజకీయ ప్రయాణం కొనసాగుతోందన్నారు. పదవి రానంత మాత్రాన బాధ పడనని.. తనకు న్యాయం చేయడానికి చంద్రబాబు ఎప్పుడు ప్రయత్నిస్తా రని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సమీకరణాల వలన ఈసారి పదవి ఇవ్వలేకపోయి వుండొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. పిఠాపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాన ని.. ఈ అవకాశమే తనకు పెద్ద పదవని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కూటమి నిర్ణయానికి కట్టుబడి తనతో సహా తన భార్య పిల్లలు కష్టపడి పనిచేశామని వర్మ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కు, కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకారాన్ని అందిస్తామన్నారు. కార్యకర్తలంతా సంయమనంతో పార్టీని ముందుకు నడిపించాలని వర్మ పిలుపునిచ్చారు.
వర్మకు దక్కేదేంటి
పవన్ ఎమ్మెల్యేగా గెలవటంలో వర్మ కీలకంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని పవన్ స్వయంగా చెప్పుకొచ్చారు. పిఠాపురంలో కొద్ది రోజులుగా రాజకీయ లెక్కలు మారుతున్నాయి. నియోజకవర్గం లో వర్మకు ప్రాధాన్యత పైనా చర్చ జరుగుతోంది. ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ వస్తే మరింత ప్రాధాన్యత పెరుగుతుందని ఆయన మద్దతు దారులు భావించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు లేకపోవటంతో.. తిరిగి 2027 లో అవకాశం ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. అయితే, వర్మకు ఈ లోగా రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి ఇస్తారా ... అనే చర్చ కొనసాగుతోంది. ఈ నెల 14న పిఠాపురంలోనే జనసేన ప్లీనరీ జరగనుంది. ఈ వేదిక నుంచి పవన్ మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరి.. వర్మకు పదవి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications