అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీర్మానం వెనక్కి తీసుకుంటున్నాం! మండలిని రద్దు చేయకండి ప్లీజ్.!కేంద్రానికి సీఎం జగన్ నివేదన.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : మండిలి రద్దు అంశంలో ఏపి ముఖ్యమంత్రి జగన్ మసను మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే అనర్థాలు అనేకం అని భావించిన జగన్ శాసన మండలి రద్దు బిల్లును ఉపసంహరించుకోబోతున్నట్టు సంకేతాలిస్తున్నారు. దీంతో మండలి రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికి గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుటూ, మండలి రద్దు చేయవద్దని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానం చేయనుంది ఏపి శాసనసభ.

ఆరోజు ఎమోషన్.. ఈరోజు రియలైజేషన్ ..

ఆరోజు ఎమోషన్.. ఈరోజు రియలైజేషన్ ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. శాసనమండలిని రద్దు చేయడంతో పాటు గతంలో చేసిన తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. రాజధాని బిల్లులను మండలి సెలక్ట్ కమిటీకి పంపడంతో 2020 జనవరిలో సీఎం జగన్ మండలి రద్దు చేయాలని నిర్ణయించారు. వెంటనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి అసంబ్లీలో రెండింట మూడు వంతుల మెజార్టీతో ఆమోదం తెలిపారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. తక్షణం మండలిని రద్దు చేయాలని సీఎం జగన్ కోరారు.

మండలిలో సంపూర్ణ మెజారిటీ..

మండలిలో సంపూర్ణ మెజారిటీ..

మండలి రద్దు తీర్మానం సందర్భంగా సీఎం జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమకు ఏడాదిన్నరలో పూర్తి మెజార్టీ వస్తుందని తెలిసి కూడా రద్దు చేస్తున్నామని, శానమండలి వల్ల ప్రజాదనం వృధా మినహా ఎలాంటి ఉపయోగం లేదని ప్రకటించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మండలి రద్దుపై వెనక్కి తగ్గారు ఏపీ సీఎం. ఈ మేరకు విడిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. శాసన మండలిలో ఖాళీ అవుతున్న ప్రతి ఎమ్మెల్సీకి వైఎస్ఆర్‌సీపీ సభ్యులే నామినేట్ అవుతున్నారు. గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా ఇలా ప్రతి స్థానం వైఎస్ఆర్‌ సీపీకే దక్కుతోంది. ఈ కారణంగా పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలకు పదవులు దక్కుతున్నాయి.

పెద్దలు గర్జించాలి..

పెద్దలు గర్జించాలి..

అయితే శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులను నామినేట్ చేయడం, ఎన్నికల్లో పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమయంలో జగన్ శాససనభలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నారని, శాసనమండలి రద్దుపై వెనక్కి తగ్గబోమని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు అదే పనిగా చెబుతున్నారు. కానీ తమకు పూర్తి మెజార్టీ వచ్చే సిరికి అందరూ తమ అభిప్రాయాలు మార్చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో ఆవేశాలు అంతగా పరనికి రావనే ఉదంతాలను కూడా మండలి రద్దు నిర్ణయం చెప్పకనే చెబుతున్నట్టు చర్చ జరుగుతోంది.

 మొదటి తీర్మణం కావాలని..

మొదటి తీర్మణం కావాలని..

శాసనసభ సమావేశాలు మంగళవారం, లేదా బుధవారం ముగించేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ లోపే తీర్మానం ప్రవేశ పెట్టి, ఆమోదించి, కేంద్రానికి పంపే యోచనలో ఏపి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మండలి రద్దు తీర్మానం అందిన తర్వాత కేంద్రం పార్లమెంట్‌లో బిల్లులు పెట్టాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా పార్లమెంట్ సమావేశాలు పరిమితంగా జరిగాయి. అందుకే ఆ తీర్మానంపై కేంద్రం దృష్టి పెట్టలేదు. ఇప్పుడు పూర్తి స్థాయి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సమయంలో ఏపీ ప్రభుత్వం మండలి రద్దు వద్దని కేంద్రానికి మళ్లీ తీర్మానం పంపుతోంది. ఇక కేంద్ర స్పందనపై ఉత్కంఠ లెలకొంది.

English summary
The AP legislature is set to pass another resolution asking the Center not to dissolve the council, reversing a previous resolution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X