PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఫిక్స్..!!
రైతులకు కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్. పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ముహూర్తం దాదాపు ఫిక్స్ అయింది. ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. 22వ విడత పీఎం కిసాన్ నిధుల పైన కేంద్ర అధికారులు క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి సమయంలో రైతులకు ఈ నిధులు విడుదల చేస్తారని భావించారు. అయితే, ఇప్పుడు రెండు పథకాల నిధులు జమ చేసేందుకు కొత్త తేదీ ఖరారు చేసారు. ఇటు ఏపీ ప్రభుత్వం ఈ మేరకు సమాయత్తం అవుతోంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాగా, కేంద్ర బడ్జెట్ వేళ రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేసారు. కాగా.. ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తోంది. ఈ రెండు పథకాల నిధులు ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 14 వేలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.

కాగా, 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. అయితే, ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ఉండే అవకాశం ఉండటంతో.. 14వ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 21 విడతల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు.
ఇక.. ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్ తో కలిపి రెండు విడతల్లో రూ 5 వేలు చొప్పున రూ 10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, ఇప్పుడు మూడో విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడత తో కలిపి జమ చేయనుంది. మూడో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో రూ 4 వేలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ 20 వేలు అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న రూ 6 వేలు మినహాయించి.. మిగిలిన రూ 14 వేలు మూడు విడతలుగా పీఎం కిసాన్ తో పాటుగా అందించాలని నిర్ణయించింది. దీంతో... పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులు కలిసి ఫిబ్రవరి రైతుల ఖాతాల్లో ఒకే సారి రూ 6 వేలు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications