రూ.200 కోట్లు ఆదా: బాబు ప్రభుత్వానికి ప్రధాని మెచ్చుకోలు

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభినందించారు. ఏపీ విద్యుత్ పొదుపు చర్యలను ప్రశంసించారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఏపీ అమలు చేస్తున్న విద్యుత్ పొదుపు చర్యలకు కితాబిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని అభినందించారు. విద్యుత్ ఆదా కోసం తీసుకున్న చర్యలు ఏమిటని మోడీ ఏపీ సీఎస్‌ను అడిగారు.

PM Modi appreciate AP government on Power saving

దానికి సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తాము చేపడుతున్న ఇంధన పొదుపు చర్యలను మోడీకి వివరించారు. ప్రధానంగా వీధి లైట్ల కోసం ఎల్ఈడీ బల్బులు వినియోగిస్తున్నామని, తద్వారా విద్యుత్ ఆదా చేస్తున్నామని చెప్పారు.

భవిష్యత్తులో గహ అవసాల కోసం కూడా ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. అప్పుడు మరింత విద్యత్ ఆదా అవుతుందని చెప్పారు. ఎల్ఈడీ బల్బుల ద్వారా రూ.200 కోట్లు ఆదా చేశామని సీఎస్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+