• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెల్ డన్ జగన్ - భుజం తట్టి ప్రధాని ఏం చెప్పారు..!!

|
Google Oneindia TeluguNews

ప్రధాని విశాఖ టూర్ సక్సెస్ పై ఏపీ ప్రభుత్వం హ్యాపీగా ఉంది. ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీతో ఈ పర్యటన పూర్తిగా ఆ సమావేశం హైజాక్ చేస్తుందని ప్రతిపక్షాలు అంచనా వేశాయి. కానీ, తెల్లారే సరికి సీన్ మారిపోయింది. బీజేపీ నేతలు ప్రధాని విశాఖ రాక వేళ రోడ్ షో నిర్వహిస్తే.. ఏపీ ప్రభుత్వం బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సభ సక్సెస్ అయింది. ప్రధాని సైతం బహిరంగ సభ ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేసారు. బీజేపీ నేతలు తమ విమర్శలను పక్కన పెట్టి ఏపీ ప్రభుత్వాన్ని కార్యక్రమం సక్సెస్ చేయటం పైన అభినందించారు.

పవన్ భేటీని హైజాక్ చేసిన సీఎం
ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతున్న సమయంలో..సభా వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు.. సంకేతాలు మొత్తంగా చర్చనే మార్చేసాయి. వేదిక పైన ప్రధాని మోదీ..సీఎం జగన్ మధ్య చోటు చేసుకున్న సంభాషణలు.. నవ్వుతూ ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటూ మాట్లాడుకోవటంతో వారిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారానికి ముగింపు ఇచ్చారు. ఇక సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడటం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. దీని పైనా వైసీపీ స్పష్టత ఇచ్చింది. ఏపీకి ఏం కావాలో ఇప్పటికే ప్రధానికి పలు మార్లు అభ్యర్ధనల ద్వారా చెప్పామని.. ఏపీ ప్రజలు హాజరైన సభలో తాను ప్రధానిని ఏం కోరుతోంది అక్కడ హాజరైన ప్రజానీకానికి అర్దమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

PM Modi appreciates CM JAgan in Vizag public meeting, here is all

సీఎం వ్యూహాత్మక ప్రసంగంతో..
ఇక, సభలో ప్రధానికి సీఎం గౌరవం ఇస్తూ..ఆయన మద్దతు కోరే ప్రయత్నం చేసారు. అదే సమయంలో తమ బంధం రాజకీయాలకు అతీతమంటూ ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. ప్రధానికి సైతం సీఎం తెలుగులోనే చెప్పినా.. ఏం చెప్పారనేది మాత్రం స్పష్టమైందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం.. పార్టీలకు, రాజకీయాలకు అతీతం...అంటూ ముఖ్యమంత్రి జగన్ అటు బీజేపీ నేతలకు..ఇటు ప్రతిపక్షాలకు తాను ఏం చెప్పదలచుకున్నారో తేల్చి చెప్పారు. పెద్దమనసు చూపితే.. అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును, మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తుపెట్టుకుంటారు..అని చెప్పటం ద్వారా ప్రజల సమక్షంలోనే ఏపీ ఏం కోరుకుంటుందో ప్రధానికి వివరించారు.

PM Modi appreciates CM JAgan in Vizag public meeting, here is all

ముఖ్యమంత్రికి ప్రధాని ప్రశంసలు
విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నుంచి రైల్వే జోన్‌ వరకు... ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులను మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనుసుతో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని ప్రజల సమక్షంలోనే ప్రధానిని అభ్యర్ధించటం ద్వారా.. తాను రాజకీయాల కంటే ఏపీ సమస్యల పైనే ప్రధానికి కలుస్తానని..గతంలో తాను ప్రధానికి కలిసిన సమయంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు పీఎం మోదీ వేదికపైన ఉండగానే ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇక, వేదిక పైనే సీఎం జగన్ ను ప్రధాని మోదీ భుజం తట్టి అభినందించారు. వెల్ డన్ జగన్ అంటూ..అందరి సమక్షంలోనే ప్రశంసించారు. ఇప్పుడు ఈ మొత్తం పరిణామాల పైన రాజకీయంగా ఆసక్తికర చర్చ మొదలైంది. మొత్తంగా ప్రధాని - సీఎం జగన్ మధ్య సత్సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో విశాఖ సభ ద్వారా మరోసారి స్పష్టం చేసారు.

English summary
PM Modi appreciated CM JAgan in Vizag public meeting, YSRCP leaders happy with PM Modi toru success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X