ఇక్కడ మోదీ ఉన్నారనే సంగతి పాకిస్థాన్ మరిచిపోద్దు..!!
పాకిస్థాన్ కు ప్రధాని మోదీ మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ తో చర్చలు ఉండవని.. జరిగితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైనే ఉంటాయని మరోసారి తేల్చి చెప్పారు. పాక్ ఎప్పుడూ మనతో నేరుగా యుద్ధం చేయలేదని.. దొంగదెబ్బ తీయడమే పాకిస్థాన్‌కు తెలుసని మోదీ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులను తుదముట్టించినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు. మన మహిళల సిందూరాన్ని చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపేసినట్లు చెప్పారు.
మోదీ మార్క్ వార్నింగ్
ప్రధాని మోదీ పాకిస్థాన్ కు మరోసారి సీరియస్ హెచ్చరిక చేసారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఆపరేషన్ సిందూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నారన్నారు. త్రివిధ దళాలు చక్రవ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పారు. మన మహిళల సిందూరం చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపేశామన్నారు. పహల్గాం ఘటనకు జవాబుగా 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టామని ప్రధాని వివరించారు. మన సాయుధ దళాలు పాక్‌ను మోకాళ్ల మీద నిలబెట్టాయన్నారు. భారత్‌లో రక్తపుటేర్లు పారించినవాళ్లను ముక్కలు ముక్కలు చేశామని చెప్పుకొచ్చారు.

భారత్ రౌద్ర రూపం
ఆపరేషన్ సిందూర్ న్యాయానికి కొత్త రూపంగా పేర్కొన్నారు. సమర్థ భారత రౌద్ర రూపమని చెప్పారు. ఉగ్రదాడి జరిగితే, మన సమాధానం ఇలాగే ఉంటుందన్నారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి జవాబే దక్కుతుందని ప్రధాని మోదీ తెలిపారు. పాకిస్థాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్ టేందుకు మన ఎంపీలు విదేశాలకు వెళ్లారని చెప్పారు. పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని మన ఎంపీలు ప్రపంచానికి చాటుతార న్నారు. ఇక్కడ మోదీ ఉన్నారనే సంగతి పాకిస్థాన్ మరిచిపోయినట్టుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని ఎయిర్‌బేస్‌ను ధ్వంసం చేయాలని పాక్ ప్రయత్నించింది. కానీ, రాజస్థాన్ ఎయిర్‌బేస్‌ను పాకిస్థాన్ క్షిపణులు తాకలేకపోయాయన్నారు. మన వాయుసేన మాత్రం పాక్‌లోని ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిందని మోదీ వెల్లడించారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications