కాశీబుగ్గ తొక్కిసలాట వెనుక, ఎవరిదీ ఆలయం - ప్రధాని మోదీ ఆర్దిక సాయం..!!
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో స్పాట్ లోనే తొమ్మిది మంది మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 31 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పైన ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పరిహారం ప్రకటించారు. అయితే, ఘటన వెనుక కారణాల పై కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట పై దిగ్భాంత్రి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. శనివారం ఏకాదశి కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఈ క్రమంలో భక్తులకు సపోర్టుగా ఉన్న రెయిలింగ్ ఊడిపోవడంతో భక్తులు కిందపడిపోయారు. తప్పించుకునే క్రమంలో ఒక్క సారిగా తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలోనే భారీ ప్రాణ నష్టం జరిగింది. తరువాత తొక్కిసలాటలో క్షతగాత్రులైన వారికి సహాయక చర్యలు అందించారు.

ప్రతీ శనివారం ఈ ఆలయానికి వెయ్యి మంది వరకు భక్తులు వస్తారు. ఈ రోజు ఏకాదశి కావటంతో దాదాపు 20 వేల మంది వరకు వచ్చినట్లు చెబుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోట్టెత్తడంతో కంట్రోల్ చేయడంలో అధికారులు వైఫల్యమైనట్టు తెలుస్తోంది. అయితే, ఈ గుడికి ప్రత్యేకత ఉంది. కాశీబుగ్గలోని ఈ ఆలయం 5 ఎకరాల్లో ఉంటుంది. స్థానికులు దీన్ని ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా చెప్తూ ఉంటారు. కాశీబుగ్గకు చెందిన ఓ భక్తుడు "హరి ముకుంద పాండా" అనే భక్తుడు ఈ ఆలయాన్ని కట్టించారు.
తిరుమల ఆలయ నమూనాను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారు. గతంలో తాను తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు ఎదురైన ఇబ్బందుల కారణంగా స్థానికంగా అదే తిరుమల నమూనాతో ఈ గుడి కట్టించారు. ఏడాది క్రితమే ఈ గుడి నిర్మాణం పూర్తయ్యింది. ఇక.. ఇప్పుడు ఈ ఘటన పైన అధికారులు విచారణ ప్రారంభించారు.
-
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications