'అమరావతి' యమునా మట్టి తెచ్చిన మోడీ: బాబు-కెసిఆర్ ముసిముసి నవ్వులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి పవిత్ర జలం, మట్టిని తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలుగులో మాట్లాడుతూ... నేను సైతం ప్రజా రాజధానికి మట్టి - నీరు సమర్పిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కవితను ఉటంకించారు.
అనంతరం తాను ఢిల్లీ నుంచి తెచ్చిన మట్టి - నీరు ఇచ్చారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ప్రధాని మోడీ అమరావతి నగర నిర్మాణం కోసం మన నీరు - మన మట్టి కార్యక్రమంలో భాగంగా... పవిత్ర యమునా నది నుంచి నీటిని, మట్టిని తీసుకు వచ్చారని చెప్పారు.
పుష్పగుచ్చాల సమయంలో నవ్వుకున్న కెసిఆర్-బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేదిక పైన ఉన్న వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితరులకు అందించారు. తెలంగాణ సిఎం కెసీఆర్‌కు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
దేవాన్ష్‌ను ముద్దు చేసిన ప్రధాని
అమరావతి శంకుస్థాపన సభా ప్రాంగణానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ... ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ను ముద్దు చేశారు. అనంతరం చంద్రబాబు కుటుంబంతో ఫోటో దిగారు. దేవాన్ష్ చేయి పట్టుకొని ప్రధాని మోడీ బుగ్గను గిల్లారు. కళ్లజోడును సరదాగా దేవాన్ష్‌కు పెట్టారు.












Click it and Unblock the Notifications