Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ ను మోదీ ఏమన్నారు - ఆ నవ్వుల వెనుక..!!

డిప్యూటీ సీఎం పవన్ పై ప్రధాని జోకులు వేసారు. ఆయన ఆహార్యం పైన ప్రశ్నించారు. ప్రధాని మోదీ తన సహ శైలికి భిన్నంగా ఇతర సీఎంల సమక్షంలో పవన్ పైన వేసిన జోకులతో జనసేనాని తో సహా అందరూ నవ్వేసారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవ వేదిక పైన ఈ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. మోదీ - పవన్ మధ్య సంభాషణ, నవ్వులు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మోదీ తనతో ఏమన్నారో ఆ తరువాత పవన్ వెల్లడించారు.

హిమాలయాలకు వెళ్తారా
ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసారు. ఎన్డీఏ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ వేదిక మీదకు రాగానే అందరూ నేతలు లేచి నిలబడి అభివాదం చే సారు. వేదిక పైన ముందుగా కనిపించిన పవన్ తో మోదీ సంభాషించారు. నవ్వుతూ పవన్ ఆహా ర్యం పైన ప్రశ్నించారు. పవన్ దీక్ష వస్త్రధారణతో ప్రధాని గమనించారు. ఎప్పుడూ దీక్షలోనే ఉన్నట్లు కనిపించటం పైన ఆసక్తిగా ప్రశ్నించారు. అన్నీ వద్దనుకొని హిమాలయాలకు వెళ్లాలని అనుకుంటున్నారా అంటూ మోదీ అనటంతో స్పందనగా పవన్ ఇంకా సమయం ఉందని చెప్పారు. దీంతో, అక్కడ ఉన్న నేతలు నవ్వుల్లో మునిగి పోయారు.

PM Modi interact with Deputy CM Pawan Kalyan in Delhi CM Delhi CM Oath Ceremony

పవన్ స్పందన
ప్రధాని తనతో ఎప్పుడూ సరదాగా జోకులు వేస్తూ ఉంటారని ఆ తరువాత పవన్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ తరచూ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారాహీ దీక్ష చేసారు. తాజాగా ఇదే వస్త్రధారణతో పవన్ తమిళనాడు, కేరళ లో ఆలయాలను సందర్శించా రు. సతీ సమేతంగా మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక, ఎన్టీఆర్ ట్రస్టు 28వ వార్షికోత్సవం వేళ నిర్వహించిన మ్యూజికల్ నైట్ కు ఇదే రకమైన ఆహార్యంతో హాజరయ్యారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన పవన్ ఇదే రకమైన వస్త్రధారణతో కనిపించటం తో ఈ ప్రశ్నలు సంధించారు. ఇక, ఇలాగే ఉంటారా అంటూ ఆసక్తిగా ప్రశ్నించారు.

ఎన్డీఏ సమావేశం
పవన్ పైన ప్రతీ సందర్భంలోనూ మోదీ ప్రత్యేక అనుబంధం చూపిస్తున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార వేదిక పైకి వచ్చిన తరువాత అందరినీ మోదీ పలకరించారు. సీఎం చంద్రబాబు తోనూ సంభాషణ చేసారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత ప్రధాని మోదీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. ఎన్డీఏ బలోపేతం పైన ప్రధానంగా చర్చ జరిగింది. రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న చోట తీసుకోవాల్సిన చర్యల పైన ఈ సమావేశంలో చర్చించారు. ప్రధాని మోదీ కీలక దిశా నిర్దేశం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+