లేపాక్షి ఆలయంలో మోదీ: వీరభద్రుడికి హారతి
PM Modi AP visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఏపీలో పర్యటిస్తోన్నారు. ఈ మధ్యాహ్నం ఆయన శ్రీసత్యసాయి జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Recommended Video

ప్రధాని పర్యటనలో ఆయన వెంట గవర్నర్ జస్టిస్ ఎస్ఏ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలుత- లేపాక్షిలోని ప్రాచీన శ్రీవీరభద్ర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు, జిల్లా అధికారులు, పురావస్తు శాఖ సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

అనంతరం వీరభద్రస్వామివారికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. మూలవిరాట్టుకు హారతి ఇచ్చారు. దర్శనానంతరం మోదీకి ఆలయ అర్చకులు వేదాశ్వీరచనాలు పలికారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు. సుమారుగా 40 నిమిషాల పాటు మోదీ ఆలయ ప్రాంగణంలోనే గడిపారు.
#WATCH | Prime Minister Narendra Modi listens to verses from the Ranganatha Ramayan at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh pic.twitter.com/N7i25CTS1n
— ANI (@ANI) January 16, 2024
లేపాక్షి ఆలయ చరిత్ర, దీనికి ఉన్న విశిష్ఠత గురించి అధికారులు మోదీకి వివరించారు. ఏకరాతితో నిర్మించిన మహాశివుడి విగ్రహం, ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాడే రాతి స్తంభం, ఆలయ ప్రాశస్త్యం, శిల్పకళ సంపద, దేవాలయ నిర్మాణం తదితర వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో కొనసాగుతోంది.
#WATCH | Prime Minister Narendra Modi sings 'Shri Ram Jai Ram' bhajan at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh pic.twitter.com/6F0lyyQSXN
— ANI (@ANI) January 16, 2024
మోదీ రాక సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గట్టి బందోబస్తును ఏర్పాటు చేశాయి. శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా పోలీసు అధికారులు రోడ్డుకు ఇరువైపులా భద్రతను మోహరింపజేశారు. ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications