వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైజాగ్ రమ్మని ప్రధానికి జీవీఎల్ ఆహ్వానం-సరే వస్తానని హామీ-బీజేపీ మార్క్ కోసం !

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయంగా పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇక్కడి రాజకీయాలు మాత్రం అంతుబట్టడం లేదు. భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నా విపక్ష టీడీపీ వైపు చూస్తున్న బీజేపీ.. రాష్ట్రంలో రాజకీయంగా తమకు కలిసివస్తుందని భావిస్తున్న ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. ఇదే క్రమంలో త్వరలో విశాఖకు రావాలని ప్రధాని మోడీని రప్పించేందుకు ప్రయత్నిస్తోంది.

కేంద్ర ప్రాజెక్టుల ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని ప్రధాని మోడీకి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇవాళ విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆయన కార్యాలయంలో కలిశారు. అనేక ప్రతిష్టాత్మకమైన జాతీయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పర్యటనకు రావాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్బంగా ప్రధానికి జీవీఎల్ స్వయంగా ఓ లేఖ కూడా అందజేశారు. ఇందులో విశాఖపట్నంలో పూర్తికానున్న పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రస్తావించారు. వాటి గురించి ప్రధానికి స్వయంగా వివరించారు.

pm modi ok for bjp mp gvls request to visit visakhapatnam to launch centres initiatives

వీటిలో రూ.26,000 కోట్లతో విశాఖపట్నంలో HPCL పెట్రోలియం రిఫైనరీ విస్తరణ, ఆధునికీకరణ ప్రాజెక్ట్, IIM విశాఖపట్నం ఆధునిక, హరిత క్యాంపస్ మొదటి దశ, విశాఖపట్నంలో క్రూయిజ్ టెర్మినల్ వంటివి ఉన్నాయి.
విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయంలో మంజూరైన సౌత్ కోస్ట్ రైల్ జోన్ కొత్త కార్యాలయ సముదాయంతో సహా విశాఖపట్నంలో మంజూరైన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాలని జీవీఎల్ ప్రధాన మంత్రి మోదీని కోరారు.
సుమారు రూ.400 కోట్లతో చేపట్టే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్ట్, రూ.385 కోట్ల వ్యయంతో 400 పడకల స్పెషాలిటీ ESI హాస్పిటల్, విశాఖపట్నంలో ఆధునిక మెగా ఫిషింగ్ హార్బర్ వంటివి కూడా ఉన్నాయి.

pm modi ok for bjp mp gvls request to visit visakhapatnam to launch centres initiatives

విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్, ఇతర రక్షణ సంస్థలలో అనేక ప్రాజెక్టులు, అభివృద్ధిని కూడా ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా చేర్చవచ్చని లేఖలో ఎంపీ జీవీఎల్ తెలిపారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ విశాఖపట్నం ప‌ర్య‌ట‌న కేంద్ర ప్రభుత్వ ప్ర‌ధాన అభివృద్ధి ప‌థ‌కాల‌పై విశాఖ, రాష్ట్ర ప్రజల దృష్టి సారింప చేయడమే కాక ఈ ప్రాజెక్టులు కేవలం కేంద్ర ప్రభుత్వ చొరవతో మాత్రమే అని ప్రజలు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని జీవీఎల్ ప్రధానికి తెలియచేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఎంపీ జీవీఎల్ శ్రీ వేంకటేశ్వరుని హస్తకళా విగ్రహాన్ని బహూకరించారు. ఈ లేఖపై ప్రధాని స్పందిస్తూ వీలైనంత త్వరగా విశాఖ పర్యటనకు రావడానికి ప్రయత్నం చేస్తాననీ జివీఎల్ కు తెలిపారు. దీనిపై జీవీఎల్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

English summary
bjp mp gvl narasimha rao on today invited pm modi to visit visakhapatnam for opening of various central govt organisations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X