చంద్రబాబు సమక్షంలో పవన్ కు ప్రధాని మోదీ సర్ప్రైజ్ గిఫ్ట్..!!
అమరావతి రీ లాంఛ్ సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని వేదిక మీదకు వచ్చిన సమయంలో రైతుల నుంచి అనూహ్య రీతిలో స్వాగతం లభించింది. ప్రధాని సమక్షం లో డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రసంగం చేసారు. గత అయిదేళ్లు కాలంలో వైసీపీ హయాంలో రైతుల కష్టాలను ప్రస్తావించారు. పహల్గాం లో ఉగ్రదాడి పైన ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి సున్నిత సమయంలో ప్రధాని అమరావతి రావటం పైన ధన్యవాదాలు చెప్పారు. పవన్ ప్రసంగం పూర్తయిన తరువాత పవన్ కు ప్రధాని మోదీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
పవన్ కు గిఫ్ట్
డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగానికి ప్రధాని మోదీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రధాని మోదీ సమక్షంలో పవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కాశ్మీర్ లో ఉగ్రదాడుల అంశాన్ని ప్రస్తావించారు. గత అయిదేళ్లు కాలంలో అమరావతి రైతుల కష్టాలను గుర్తు చేసారు. కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా అమరావతి తిరిగి నిలబడుతుందని చెప్పుకొచ్చారు. దేశానికే తల మానికంగా అమరావతి నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. కాశ్మీర్ లో ఉగ్రదాడుల అంశం ప్రస్తావన సమయంలో పవన్ ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి సమయంలో ప్రధాని అమరావతి కోసం రావటాన్ని అభినందించారు. ప్రసంగం పూర్తయిన పవన్ కు ప్రధాని ప్రత్యేకంగా తన వద్దకు పిలిచారు. పవన్ ను అభినందిస్తూ తన వద్ద ఉన్న చాక్లెట్ ను గిఫ్ట్ గా అందించారు.

రైతుల కష్టం మర్చిపోం
గత ప్రభుత్వంలో వేధింపులకు గురయ్యారని చెప్పుకొచ్చారు. రాజధాని కోసం అమరావతి మహిళల పాత్ర అద్బుతమని. ఆంధ్ర పౌరుషం చూపించారని ప్రశంసించారు. గత అయిదేళ్ల కాలంలో రైతులను గత ప్రభుత్వం అవమాన పరిచిందన్నారు. అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వ శ్రేష్ఠ రాజధానిగా నిలుస్తుందని పవన్ పేర్కొన్నారు. జవాబుదారీ, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఎన్డీఏ కేంద్రం, రాష్ట్రంలో ఉన్న కారణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దశల వారీగా అమలు చేస్తున్నామని పవన్ వివరించారు. మ్యాచింగ్ గ్రాంట్స్ కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయిందని.. ఇప్పుడు ఫెడరల్ స్పూర్తితో పని చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు.
మోదీకి మద్దతుగా
రాష్ట్రంలో రహదారులు.. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నామని పవన్ వెల్ల డించారు. ఏపీ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైబరాబాద్ సిటీని రూపించారో.. అమరావతిని ఆయన అపార అనుభవంతో దక్షతతో అద్బుత నగరం గా దేశానికి తలమానికంగా తీర్చి దిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేసారు. కాశ్మీర్ లో సంక్లిష్ట సమయం లో.. యుద్ద వాతావరణం నెలకున్న వేళ.. వేదన ఉన్నా.. అమరావతి రైతుల త్యాగాలు మర్చి పోకుండా ప్రధాని రావటం పట్ల ధన్యవాదాలు వ్యక్తం చేసారు. పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తం బాధ పెట్టిందని.. ఇది సున్నిత సమయంగా పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో మోదీ అమరావతికి రావటం ద్వారా ఏపీ పట్ల తనకు ఉన్న అంకిత భావం ఏంటో స్పష్టం చేసారని పవన్ చెప్పారు.












Click it and Unblock the Notifications