బాగుంది: నరేంద్ర మోడీ ఎదుట ఏపీ రాజధాని అమరావతి ప్రస్తావన తెచ్చిన సింగపూర్ ప్రధాని
సింగపూర్/అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్ పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్, అధ్యక్షురాలు హలీమా యాకోబ్‌తో సమావేశమయ్యారు. లీపై మోడీ ప్రశంసలు కురిపించారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసేందుకు లీ హసీన్ లూంగ్ చాలా కృషి చేస్తున్నారని, భారత్‌తో పాటు ఇతర దేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సింగపూర్ కేంద్రంగా మారిందన్నారు.
మోడీ, లీలు కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగపూర్, భారత్ త్వరలోనే ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నట్లు మోడీ తెలిపారు. ప్రముఖ కంపెనీల సీఈవోలలో చాలామంది భారత్ వైపు నమ్మకంతో చూస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, ఆవిష్కరణలు, సాంకేతికత తదితర అంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించారు.

ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతోంది
భారత దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సింగపూర్ ప్రధాన ఆధారంగా ఉందని మోడీ అన్నారు. ఇతర దేశాల్లో కూడా సింగపూర్ పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇరుదేశాల మధ్య నావికా దళ సహకారం ఉందని చెప్పారు. సైబర్ నేరాలు, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు ఉండాలన్నారు. ఇరు దేశాల మధ్య ఎయిర్ ట్రాఫిక్ బాగా పెరుగుతోందన్నారు.

ఇరువురి మధ్య ఉన్నతస్థాయి చర్చలు
ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందించే విషయమై మోడీ, లీ మాట్లాడుకున్నారని, యాక్ట్ ఈస్ట్ పాలసీలో సింగపూర్ విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని, ఇరువురి మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు.

అమరావతి ప్రస్తావన
సింగపూర్ ప్రధాని లీ హసీనా లూంగ్ మాట్లాడుతూ... ఇరుదేశాల రక్షణ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు. లాజిస్టిక్ సహకారంపై ఇరు దేశాల నేవీలు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రస్తావన తీసుకు వచ్చారు. సింగపూర్ కన్సార్టియం ఆధ్వర్యంలో అమరావతి నగర ప్రాజెక్టు పురోగతి చక్కగా ఉందన్నారు. ఆర్థిక సహాయ సహకారాలు పెంచుకోవడంతో పాటు పుణెలోని విమానాశ్రయ అభివృద్ధి కోసం ఇటీవల మహారాష్ట్ర-సింగపూర్ సంయుక్త కమిటీని ప్రారంభించామన్నారు.

సింగపూర్‌లో భారత్ డిజిటల్ యాప్స్
ఇదిలా ఉండగా, భారత్‌కు చెందిన డిజిటల్ చెల్లింపుల యాప్‌ల అంతర్జాతీయీకరణలో ముందడుగు పడింది. బీమ్, రూపే, ఎస్బీఐ యాప్‌లను ప్రధాని మోడీ సింగపూర్‌లో అంతకుముందు ఆవిష్కరించారు. రూపే యాప్‌ను సింగపూర్‌కు చెందిన నెట్ వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సుఫర్ (నెట్స్)తో అనుసంధానం చేశారు. ఫలితంగా రపే వినియోగదారులు సింగపూర్ వ్యాప్తంగా నెట్స్ కేంద్రాల వద్ద చెల్లింపులు చేయవచ్చు. అలాగే, సింగపూర్ నెట్స్ వినియోగదారులు భారత్‌లో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఈ కామర్స్ వెబ్ సైట్లో కొనుగోళ్లు చేయవచ్చు.
-
ఏపీలో కొత్త లోక్‌సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!












Click it and Unblock the Notifications