• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని విశాఖ టూర్ - బీజేపీకి వైసీపీ మాస్టర్ స్ట్రోక్ :కమలం నేతల్లో కొత్త టెన్షన్..!!

|
Google Oneindia TeluguNews

ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఇదే సమయంలో కొత్త రాజకీయం తెర మీదకు వచ్చింది. ఈ నెల 11న విశాఖ చేరుకోనున్న ప్రధాని ఆ రాత్రి అక్కడే బస చేయనున్నారు. 12వతేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇటు ఏపీ ప్రభుత్వం ప్రధాని పర్యటన - షెడ్యూల్ కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు సమీక్షలు కొనసాగిస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కూడా జిల్లా అధికారులతో ప్రధాని పర్యటనపై చర్చించారు. బహిరంగ సభకు కనీసం లక్ష మంది వస్తారని, అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రధాని సభకు ప్రభుత్వ ఏర్పాట్లు
ఈ భేటీకి వాల్తేరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ను కూడా ఆహ్వానించారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధాని నగరానికి వస్తున్నారనే సమాచారం విశాఖ బీజేపీ నేతలకు అందింది. 11వ తేదీ రాత్రి ప్రధాని వస్తారని, ఆ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించాలని మాత్రమే బీజేపీ నేతలకు వర్తమానం అందింది. సభ, జన సమీకరణ గురించి చెప్పలేదు. 12వ తేదీన ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారని, అందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సాధారణంగా ప్రధాని వస్తే.. ఆయన సభకు జనసమీకరణ చేయాల్సిన బాధ్యత ఆయన పార్టీ బీజేపీది. గతంలో అలాగే చేశారు. ఇప్పుడు వైసీపీ జనసమీకరణ ప్రయత్నాలు చేస్తోంది. ఇది బీజేపీ నేతలకు అంతు చిక్కటం లేదు. ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది.

PM Modi Vizag tour: BJP asks not to inaugurate railway zone, here is the master stroke given by YCP

బీజేపీ నేతలకు లేని క్లారిటీ
ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో భాగంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిపాలనా భవనానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే అంశం బీజేపీ నేతలకు సమస్యగా మారుతోంది. ప్రధాని పర్యటన పైన బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఇప్పుడు రైల్వే జోన్ కు ప్రధాని శంకుస్థాపన చేస్తే, జోన్ క్రెడిట్ వైసీపీ ఖాతాలోకి వెళ్తోందనే అభిప్రాయం బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు పైన రాష్ట్ర విభజన సమయం నుంచి అనేక తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటు లాభదాయకం కాదని.. అందుచేత ఏర్పాటు ఉద్దేశం లేదని రైల్వే బోర్డు చైర్మన్‌ ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అదేమీ లేదన్నారు.

విశాఖలో ప్రధాని పర్యటన వేళ
ఎప్పటిలాగే డీపీఆర్‌ పరిశీలనలో ఉందని చెప్పారు. ఇప్పుడు సీఎం జగన్ హయాంలో ప్రధాని కొత్తగా రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయటం ద్వారా..రాజకీయంగా ఆ క్రెడిట్ సీఎంకు వెళ్తుందనేది టీడీపీ - బీజేపీ నేతల వాదనగా ఉంది. దీంతో, రైల్వే జోన్ పరిపాలనా భవనానికి శంకుస్థాపన కార్యక్రమం తొలిగిస్తే బాగుంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ ఢిల్లీ నేతలకు నివేదించారు. కానీ, ఇప్పుడు ప్రధాని షెడ్యూల్ లో ఖరారైన కార్యక్రమం తొలిగిస్తే, ఇప్పటికే వివాదాస్పదంగా మారటంతో ఈ కార్యక్రమం తొలిగించే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీని ద్వారా..వైసీపీ ఢిల్లీ కేంద్రంగా పక్కా వ్యూహాత్మకంగా ఈ పర్యటన విషయంలో వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.

English summary
PM Narendra Modi will be on a two-day visit to Visakhapatnam from November 11, Now it turn to political discussion in BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X